CITU:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: గ్రామపంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందర ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమ లు చేయాలని, వేతనాల పెంపు పెర్మనెంట్ కు ఈ బడ్జెట్ శాసనసభ సమావేశా ల్లోనే (budget legislative session ) ప్రకటన చేయాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) (CITU) జిల్లా ప్రధాన కార్యదర్శి చినపాక లక్ష్మీ నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం దొడ్డి కొమరయ్య భవన్ లో గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా విస్తృ సమావేశం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతపాక వినోద్ కుమార్ అధ్యక్షతన జరి గింది.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ (Lakshminarayana)మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్యం మంచినీటి సరఫరా వీధిలైట్ల నిర్వహణ పన్నుల వసులు తదితర పనులు నిర్వహిస్తున్నారని మేము అధికారంలోకొస్తే గ్రామపంచాయతీ కార్మికుల కనీస వేతనాలు పెంచు తామని, అర్హత కలిగిన వారిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని వాటి అమలుకు ఈ బడ్జెట్ శాసనసభ సమావేశాలలో తగిన ప్రకటన చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా కష్టాలు పోతాయని ఆశపడ్డారని కానీ కార్మికు లకు వారి సమస్యలు పరిష్కారం కాకపోగా మరింతగా పెరిగాయని విమర్శించారు. ఇప్పటి కైనా ప్రభుత్వానికి గ్రామపంచా యతీ కార్మికుల పైన ఏమాత్రం ప్రేమ ఉన్న మల్టీపర్పస్ వర్కర్స్ (Multipurpose workers) సంబంధం లేకుండా అందరికీ వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు.
కార్మికుల ఉద్యోగ భద్రతకు (Job security)ముప్పుగా ఉన్న మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని అర్హత కలిగిన కార్మి కులను పర్మినెంట్ చేయాలని, ప్రమాద బీమా 10 లక్షలు చెల్లిం చాలని, బిల్ కలెక్టర్ కారోబార్లకు ప్రత్యేక హెూదా కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో కార్మికులను తొలగిస్తామని భయ భ్రాంతులకు గురి చేస్తున్న అధికారు లపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటి యు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, పోలే సత్యనారాయణ, యూనియన్ జిల్లా నాయకులు ఎన్ నరసింహ, జి. ఆశీర్వాదం, పి సర్వయ్య, మంద ఎల్లయ్య, ఏ కోటయ్య, ఊరేప్రభాకర్, ఏర్పుల సైదులు, యాదమ్మ,, నాంపల్లి నరేష్, కాసర్ల స్వప్న, వడ్డే గాని యాదయ్య, సుధాకర్, రామలిం గయ్య, కొండేటి నరసయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.