CITU : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : సామాజిక న్యాయసాధన క్యాపేయిన్ ఏప్రిల్ 6 నుండి 14 వరకు జరుగు కార్యక్రమాల్లో భాగంగా సామాజిక ఉద్యమాలను బలపరచడం కొరకు సీఐటీయూ ఆధ్వర్యంలో సామాజిక సంఘీభావ నిధి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని బుధవారం సిఐటియు నలగొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో సంక్షేమ భవన్లో కార్మికులు, ఉద్యోగుల నుండి సేకరించడం జరిగినది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ మన భారతదేశంలో ఉన్నది. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సాటి మనిషిని మనిషిలాగా చూడలేని దుర్మార్గపు స్థితి నేటికీ కొనసాగడం అమానుషం. కుల, మత, ప్రాంతాఓ, లింగ బేధం లాంటి సామాజిక రుక్మత్తులు మన భారతదేశంలో ప్రజల్ని కార్మిక వర్గాన్ని ఐక్యం కానివ్వకుండా దానికి అడ్డుగా ముళ్ళకంచెలు ఉన్నాయి. దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం పాలకవర్గాలు కార్మిక వర్గంలో సున్నితమైన ఈ అంశం ముందుకు తెస్తున్నారు.
దాంతో కార్మిక వర్గం ఐక్యతను విచ్చిన్నం చేసి దోపిడి వర్గాల తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయని అన్నారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక న్యాయ సాధన క్యాంప్ నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కార్యక్రమంలో సిఐటియు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలను భాగస్వామ్యం చేయడం కోసం ఏప్రిల్ 6న కార్మిక ఉద్యమ నేత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణదీర్ వర్ధంతి నుండి ప్రారంభించి ఏప్రిల్ 10న శ్రామిక మహిళా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమనేత కామ్రేడ్ విమల రణదీవ్ జయంతిని, ఏప్రిల్ 11న భారతీయ సామాజిక సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి, ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక ఉద్యమ కారుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో సెమినార్లు, సదస్సు లు వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బాణాల పరిపూర్ణాచారి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివొజు సైదాచారి, మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్, కోట్ల అశోక్ రెడ్డి, పాక లింగయ్య, గుండాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.