మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
నల్గొండటౌన్, ప్రజదీవెన:మున్సిపాలిటీలలో ( muncipalities) కాంట్రాక్ట్, అవు ట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఫిక్స్డ్ పే, డైలీ వేజ్ తదితర పద్ధతుల్లో పని చేస్తున్న కార్మికులందరినీ ( workers) పర్మినెంట్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ మున్సి పల్ వర్కర్స్ అం డ్ ఎంప్లాయిస్ యూనియన్( union ) నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమ స్యల పరిష్కారం కోసం జరు గుతున్న రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగింది.
దీక్ష శిబిరానికి హాజరై మద్దతు ప్రకటిం చిన భూపాల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపల్ కార్పొరేషన్ లలో సుమారు 65 వేల మంది శానిటేషన్ ( sanitation) వాటర్ సప్లై ట్రాక్టర్ డ్రైవర్ ఎలక్ట్రిసిటీ డంపింగ్ యార్డ్స్ పార్కుల నిర్వహణ తదితర విభాగా లలో పనిచేస్తున్నారని అన్నారు. పర్మినెంట్ కనీస వేతనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాంటి ప్రభు త్వ సంక్షేమాలు ( governm entsch emes) , కార్మికులకు రక్షణ సదుపాయాలు కల్పించడం లేదని అ న్నారు.
అనేకమంది కార్మికులు పని చేస్తున్న సమయాల్లో ప్రమా దాలు( accidents) జరిగి మరణి స్తున్నారని, రాత్రిపూట చేసే సమ యాల్లో అతివేగంగా వచ్చే వాహ నాల కింద పడి ప్రమాదాల్లో మరణిస్తున్నారని అటువంటి వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించడం లేదని అన్నారు. ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని( insurence scheme) అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసేలోపు కనీస వేతనం 26,0 00 అమలు చేయాలని అన్ని మున్సిపాలిటీలలో ఎనిమిది గంట ల పని విధానం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారి చదువు మరి యు వృత్తి నైపుణ్యతను గుర్తించి జవాన్లుగా డ్రైవర్లుగా శానిటరీ ఇన్స్పె క్టర్లుగా కంప్యూటర్ ఆపరే టర్లుగా ( operaters) ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాత్రివేళ డ్యూటీ చేసే కార్మికులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాలని రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రతి మున్సిపల్ కేంద్రంలో ఈఎస్ఐ ( esi ) హాస్పిటల్ ఏర్పాటు చేయా లని మున్సిపల్ కార్మికుల వేతనాల నుండి కటింగ్ చేసిన పీఎఫ్ ఈఎ స్ఐ డబ్బులు వారి వ్యక్తిగత ఖాతా ల్లో జమచేయని మున్సిపల్ అధి కారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదివారాలు జాతీయ సెలవులు రాష్ట్ర పండుగల సందర్భంగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని మున్సిప ల్ కార్మికులందరికీ మొదటి ప్రాధాన్యతనిచ్చి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇండ్లు ఇండ్ల స్థలాలు ( house plots) ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణంలో స్థానికంగా పెండింగ్ ఏరియార్స్ బకాయిలు బట్టలు చెప్పులు సభ్యులు నూనెలు ఇవ్వాలని, ఆదివారాలు జాతీయ సెలవులు కచ్చితంగా అమలు జరపాలని ఆందోళన పోరాటం నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
స్థానిక మునిసిపల్ కమిషనర్, పాలకవర్గం స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని లేని యడల 12 నుండి జరిగే సమ్మెకు పూర్తి బాధ్యత వహించాల్సిందని హెచ్చరించారు.ఈ కార్య క్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యం డి సలీమ్, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ నాయకులు అద్దంకి నర్సింహ, కోట్ల అశోక్ రెడ్డి, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాలడుగు వెంకటేశం, కత్తుల పద్మ, నక్క సత్తయ్య, సంద భాగ్యమ్మ, దీనమ్మ, సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
Citu Muncipal workers