Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CITU: ఆశాలకు 18వేల వేతనం నిర్ణయించాలి

–ఆతరువాతనే కొత్త సర్వేలు చే యించాలి

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం 18000 అమలు చేయాలని సిఐటియు జిల్లా సహా య కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. సోమవారం న ల్గొండ పట్టణంలోని పానగల్లు అ ర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ కు తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియ న్ (సిఐ టియు) రాష్ట్ర కమిటీ పిలుపుమే రకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఈనెల 2 వ తేదీ నుండి లెప్రసి, పల్స్ పోలి యో, టిబి బకాయి పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్వేల బకాయిలు చెల్లించే వరకు కొత్త సర్వేలూ చేసేదిలేదని వారి ఇతర రొటీన్ పనులు మాత్రం క్రమం తప్పకుండా చేస్తూ పోరాడు తున్నారని అన్నారు.

సిఐటియు యూనియన్ గా ఆశాల సమస్యలు ఎప్పటికప్పుడు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళామని బకాయిలు ఇప్పించి ఆ తరువాతనే కొత్త సర్వేలు చేపించాలని వినతి పత్రం ఇచ్చామని అన్నారు. ఆశాలకు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్ డ్ వేతనం 18 వేలు కు బడ్జెట్ నిర్ణయించే అమలు చేయాలని ఆయన కోరారు. గతంలోఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ 50 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా మట్టి ఖర్చులకు 50వేలు చెల్లిస్తూ ప్రభుత్వం సర్కులర్ జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఎన్నికల విధులు నిర్వహించిన ఆశాలకు డబ్బులు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆశాలకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా,రిటర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు.

ప్రసూతి సెలవులు కల్పిస్తూవెంటనే సర్కు లర్ జారీ చేయాలని, ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని అదేవిధంగా ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశాలకు ఏఎన్ఎం, జిఎ న్ఎమ్ ప్రమోషన్ సౌకర్యం కల్పిం చాలని, టెన్త్, ఓపెన్ టెన్త్, ఇంటర్ ఓపెన్, ఇంటర్, డిగ్రీ, టెట్, గ్రూప్ 1,2 తదితర ఎగ్జామ్స్ సందర్భంగా ఆశాలకు వేస్తున్న డ్యూటీలకు డబ్బులు చెల్లించాలన్నారు. ఆశాలకు పారితోషకాల గైడ్ లైన్స్ కు భిన్నంగా ఏ ఎన్ సి తదితర టార్గెట్స్ ఎక్కువ కేసులు నమోదు చేయాలని ఆశాలను వేధింపులకు గురిచేస్తున్న జిల్లా అధికారుల పైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పై సమస్యల పరిష్కారానికి ఈనెల 10న జరిగే చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని కోరారు.

అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర ఆ తర్వాత నిరవధిక సమ్మె తప్పదని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో సిఐ టియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పానగల్లు అర్బ న్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్లు అనురాధ, మాధవి, శైలజ, పద్మావతి ,సుధారాణి, ధనలక్ష్మి విమల జ్యోతి చంద్రకళ కల్పన నాగమణి మమత రాణి తది తరులు పాల్గొన్నారు.