Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CITU Vanguri Ramulu : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి

–మే 20 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

–ఆల్ ట్రేడ్ యూనియన్స్ సదస్సులో ఒక వక్తల పిలుపు

CITU Vanguri Ramulu :ప్రజాదీవెన నల్గొండ : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని మే 20న జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు పిలుపునిచ్చారు. శనివారం టీఎన్జీవో భవన్ లో ఆల్ ట్రేడ్ యూనియన్స్ మే 20 సమ్మె సన్నహాక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారులకు వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తుందని ఆరోపించారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా వంద సంవత్సరాల లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోళ్లను ముందుకు తెచ్చిందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో లేబర్ కోడ్ ల అమలు ఐదు సంవత్సరాలు ఆలస్యమైనా వాటిని ఇప్పుడు అమలు చేస్తూ పూర్తిగా కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను వెనక్కి కొట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించాయని వాటిని నల్గొండ జిల్లాలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న, బి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలువేరు ప్రభాకర్ లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు వాటిలిందని అన్నారు.

కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్ లు అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సామాజిక భద్రతా పథకాలుకు నిధులు తగ్గిస్తున్నది కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ చేసి కార్మిక సంఘాలు రద్దు చేసేందుకు బలితెగించిందని విమర్శించారు. ఉమ్మడి భేరసాలలో హక్కులను తొలగించి వాటిని బిఎన్ఎస్ చట్టం ద్వారా నాన్ బేలబుల్ కేసులుగా మార్చడం 10 స్థలాల వద్ద గేటు మీటింగులు కరపత్రాల పంపిణీ వంటి వాటిని సైతం నిషేధించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటిని తుంగలో తొక్కుతున్నారని అన్నారు. చట్టాలు అమలు చేయని యాజమాన్యాలకు శిక్షలు తగ్గించడం కార్మిక శాఖను పూర్తిగా ఫెసిలిటేట్ విభాగంగా మార్చడం, స్కీం వర్కర్లను కార్మికులకు గుర్తించకుండా వెట్టిచాకిరి చేసే విధంగా లేబర్ కోడ్ లను రూపొందించారని అన్నారు. కార్మికుల సమ్మెకు నిర్వీర్యం చేస్తూ సమ్మె చేయలేని పరిస్థితులను ఈ కోడు ద్వారా కల్పించి కార్మికులను తిరిగి బానిసత్వంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈ నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు కార్మిక వర్గం అంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ సదస్సుకు సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బొంగురాల నరసింహా లు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు నరసింహారెడ్డి, కే. సైదిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, ఆర్ ఆచారి, తదితరులు పాల్గొన్నారు.