జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు
మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 18 మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల కేంద్రంలో ఉన్న సబ్ వ్యవసాయమార్కెట్ కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు మంగళవారం రోజున సందర్శించారు అక్కడ రైతులు ఎండబెట్టిన వరి ధాన్యాలను పరిశీలించి వ్యవసాయ రైతులకు వరి ధాన్యాన్ని కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను సూచించారు రైతులకు బ్యాంకు ఖాతాలు డబ్బులు మరియు బోనస్ సకాలంలో జమ అయ్యేలా చూడాలని పి ఎస్ ఎస్ ఇన్చార్జి నితీష్ కు జిల్లా అధికారి ఆదేశించారు రైతులు అమ్మకం చేసిన వరి ధాన్యాన్ని పాస్ బుక్ వివరాలు ఏఈఓ ధ్రువీకరణ పత్రం జతచేసి సంబంధించిన మిల్లుకు పంపించాలని కోరారు. జిల్లాకు ఇతర జిల్లాల వరి ధాన్యం రావడం లేదని ఓ పి ఎం ఎస్ ఎస్ నమోదు ఉంటుందని అందువల్ల ఇతర జిల్లాల వరి ధాన్యాలు వచ్చే అవకాశం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఇంచార్జ్ నితీష్ శేఖర్ రెడ్డి వెంకటయ్య హరి యాదమ్మ చంద్రకళ నరసింహ రాములు తదితరులు పాల్గొన్నారు