Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Civilsupplydepartment : పండుగకు పస్తులేనా

--సమ్మెకు దిగిన సివిల్ సప్లై హమా లీ వర్కర్స్ --రేషన్ తో పాటు విద్యార్థుల మ ధ్యాహ్న భోజనానికి విఘాతం --సమస్యలు పరిష్కరించే వరకు విరమించబోమంటున్న హమాలీ లు -- తెలంగాణలో సివిల్ సప్లై అధికారుల మల్లగుల్లాలు

పండుగకు పస్తులేనా..!

–సమ్మెకు దిగిన సివిల్ సప్లై హమా లీ వర్కర్స్
–రేషన్ తో పాటు విద్యార్థుల మ ధ్యాహ్న భోజనానికి విఘాతం
–సమస్యలు పరిష్కరించే వరకు విరమించబోమంటున్న హమాలీ లు
— తెలంగాణలో సివిల్ సప్లై అధికారుల మల్లగుల్లాలు

Civilsupplydepartment : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉంది. పండుగకు పస్తు లేనా అనే కోణంలో సర్వత్ర అనుమానాలు వెల్లువెత్తుతు న్నాయి. పౌరసరఫరాల శాఖ గోదాముల్లో కీలక విధులు నిర్వహించే హమాలీ వర్కర్స్ ఉన్నఫలంగా మూకుమ్మడిగా సమ్మె నినాదం పుచ్చుకున్నా రు. దీర్ఘకాలంగా అపరిస్కృతమైన తమహక్కుల సాధ న కోసం విధి లేని పరిస్థితుల్లో పోరాటమే శరణ్యమని భావించి సమ్మెకు సైరన్ మోగించారు.

దీంతో పౌరసర ఫరాల శాఖ ఒకవైపు రేషన్ షాపు లకు కానీ, ప్రభు త్వ ఆయా స్థాయి ల్లోని విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా అయ్యే బియ్యం రవాణా ప్రక్రియకు విఘా తం కలిగే అవ కాశం స్పష్టంగా కన బడుతోoది. అయా రంగాలకు సర ఫరా అయ్యే బియ్యాన్ని లోడ్, అ న్లోడ్ చేసే ప్రధాన క్రతువులో కీలక భూమిక పో షించే హమాలీలు సమ్మెకు దిగడంతో సంబంధిత శాఖ అధికా రులు మల్లగుల్లాలు పడుతున్నారు.

తెలంగాణలో వ్యా ప్తంగా 33 జిల్లాలో సివిల్ సప్లై హ మాలీ వర్కర్స్ అందరూ సమ్మె కు పూనుకున్నారు. హమాలి వర్కర్లకు మద్దతుగా ఇప్పటికే వామపక్ష పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. కార్మి కులు ఆయా గోదాముల ముందు ధర్నాలకు దిగడంతో సివిల్ సప్లై వ్యవస్థ ఆగమ్య గోచరంగా తయారైంది. గత కొంతకాలంగా రెండు సంవత్స రాలకు ఒకసారి లోడ్ అన్లోడ్ లకు ఇచ్చే రేటును 10 శాతం పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాకపోగా పదేపదే వాయిదాలు పడుతూ వస్తున్న కారణంగా సహనం కోల్పోయిన హ మాలీ కార్మికులు కాకూడని పరిస్థితుల్లో పోరాటానికి సిద్ధమయ్యా రు.

ప్రభుత్వానికి గాని అధికారయంత్రంగoనికి పలు దఫాలు విన్న వించి నప్పటికీ సరైన సమాధానం రాకపోగా దాటవేత ధోరణి ఎదురు కావ డంతో కార్మి కులు విధులేని పరిస్థితుల్లో విధులు బహిష్కరించి ధర్నా లకు ఉప క్రమించారు. ఎంతోకాలంగా తమకు రావాల్సిన హక్కుల ను ఇంతవరకు పరిష్కరించకపోగా తాత్సారం కావడానికి సహిం చలేక సమ్మెకు దిగారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు ఆ శాఖ కమిషనర్ తో నేరుగా విన్నవించుకోవడంతో పాటు లిఖితపూర్వకంగా వినతి పత్రాలు సైతం సమర్పించినట్లు హమాలి వర్కర్స్ యూనియన్ నేతలు చెబుతున్నారు.

ప్రభుత్వప రంగా ఆయా స్థాయిల్లో పలు దఫా లు విన్నపాలు విన్న వించినప్పటికీ ఎలాంటి చలనం లేకపోవడంతో హ మాలి కార్మికులు సమ్మెకు ప్రారం భించారు. దీంతో దారిద్రపు దిగు వున కుటుంబాలకు రేషన్ బియ్యo సరఫరా చేయడం ప్రశ్నార్ధకంగా మారిన పరిస్థితులు కనబడుతున్నాయి.
*ఇప్పటికే ప్రారంభించాల్సిన బియ్యం రవాణా…* కొత్త సంవత్స రంలో మొదటి నెల జనవరి కి సంబంధించి ఇప్పటికే రవాణా ప్రారం భించడంతోపాటు రేషన్ షాపులకు చేరవలసిన సమయం ఆసన్న మైంది. ఈ సమయంలోనే కార్మికులు సమ్మెకు దిగడంతో ఓవైపు ప్రభుత్వానికి మరోవైపు ప్రభుత్వ యంత్రాంగానికి తలనొప్పులు తప్పవన్న పరిస్థితు లు స్పష్టంగా కనబడుతున్నాయి. అదే సంద ర్భంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో, ఐ సి డి ఎస్ లకు మధ్యాహ్న భోజ న పథకానికి సంబంధించిన కోటా బియ్యం రవాణా కూడా ఆటంకం కలిగే అవకాశాలు లేకపోలేదు.

వీటన్ని టికీ బియ్యం రవాణా నిలిచిపోతే ప్రభుత్వం అభాసు పాలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ లో ప్రతినిధులు అధికార యంత్రాంగం చొరవ తీసుకొని వెన్న వెంటనే హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి హక్కుగా రావలసిన ప్రభుత్వ పరంగా సౌకర్యాలు వెన్నువెంటనే అందించి కార్మికుల సమ్మెను విరమింపజేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

ఒకరకంగా కార్మికులు సమ్మెకు దిగడం సమస్యను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో తప్ప దురుద్దేశంతో ఎంత మాత్రం కాదని వారు వాదిస్తున్నారు. ప్రభు త్వ పెద్దలతో పాటు 33 జిల్లాల కలె క్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికా రులు ఈ విషయంపై దృష్టి పెట్టి హమాలీ కార్మికులతో చర్చించి రేషన్ షాపులు, ప్రభుత్వ సతి గృహాలు, ఐ సి డి ఎస్ సి ల కు, రెసిడెన్షియల్ హాస్టల్ లకు సరైన సమయంలో బియ్యం రవాణా పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

అదే సందర్భంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రజలకు అందా ల్సిన రేషన్ బియ్యం సరఫరా సైతం నిలి చిపోనునందున సదరు దృష్టి తోనై నా ప్రభుత్వం వెనువెంటనే పరి ష్కార మార్గాలు అన్వే షించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం హమాలీ కార్మికుల సమ స్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.