–ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్గొండ జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు
— హాజరుకానున్న శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు
Classification SC : ప్రజాదీవెన నల్గొండ : అసెంబ్లీలో ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా మాలలతో కలిసి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో ఈనెల 28న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నల్లగొండ జిల్లా చైర్మన్ లకుమాల మధుబాబు తెలిపారు. బుధవారం హాలియా లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశని హాలియా మండల కన్వీనర్ రువ్వ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడానీ మాలలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు శాసనసభ్యులు జి. వివేక్ వెంకటస్వామి, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి. చెన్నయ్య, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ సర్వయ్య, కో కన్వీనర్లు, మాల ప్రజా ప్రతినిధులు, మాల మేధావులు, మాల మహిళ నాయకురాలు, విద్యార్థులు, కవులు, కళాకారులు, అంబేద్కర్ వాదులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ మాలల భవిష్యత్ కార్యాచరణను నాగార్జునసాగర్ నియోజకవర్గ నుండే ప్రకటిస్తామని తెలిపారు. మాలలకు నామినేటెడ్ పోస్టులలో తీవ్ర అన్యాయం జరుగుతుందని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఉమ్మడి నల్లగొండ జిల్లా మాల బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి జంగాల బిక్షం, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గండమాల్ల జానయ్య, మాల మహానాడు నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు అంగరాజు స్వర్ణలత, రిటైర్డ్ ఉద్యోగస్తుల నాయకులు రువ్వ అనంతరాములు, నిడమనూర్ మండల అధ్యక్షులు చింతమల్ల వెంకన్న, నిడమనూరు మండల కన్వీనర్ మండారి రామాంజనేయులు, హాలియా పట్టణ కన్వీనర్ రాయల వెంకన్న, పెద్దవూర మండల కన్వీనర్ మద్దూరి శ్రీను, తిరుమలగిరి మండల కన్వీనర్ జంగాల వీరేందర్, సాగర్ మున్సిపాలిటీ కన్వీనర్ కొచ్చర్ల నాగేందర్, మాల మహానాడు సీనియర్ నాయకులు మోటమర్రి సురేందర్, తిరుమలగిరి మండల కో కన్వీనర్ జంగాల శ్రీను, సాగర్ మున్సిపాలిటీ కో కన్వీనర్ మేకల ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.