కనగల్ (ప్రజా దీవన):
Kidney Transplant Surgery: మండలంలోని కనగల్ గ్రామానికి చెందిన రావుల ఉపేందర్ గౌడ్ గత కొన్ని నెలల నుండి రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆపరేషన్ చేయడానికి 11 లక్షల అవసరం ఉన్నాయని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు తోటి స్నేహితులు గ్రామస్తులు ఎవరికి తోచిన సహాయం వారు ఫోన్ పే ద్వారా సాయం చేస్తున్నారు.
ఉపేందర్ తో పాటు చదువుకున్న పదవ తరగతి చెందిన స్నేహితులు తనతో చదువుకున్న మిత్రునికి ఆపదలో ఉన్నాడు అని తెలుసుకుని 10 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న మిత్రుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకొని మేమున్నామంటూ ముందుకు వచ్చారు హాస్పిటల్ ఖర్చు కోసం 72 వేల రూపాయలు అందజేశారు.