CM Revanth : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం రంగాలు అభివృద్ధి చెందడానికి రాబోయే కొద్ది రోజుల్లో ఒక విధానం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఎ.రే వంత్ రెడ్డి చెప్పారు. ఐటీ, ఫార్మా, మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాలతో పాటు టూరిజం రం గాలు రాష్ట్రంలో అభివృద్ధి చెందా ల్సిన అవసరం ఉందన్నారు. వీటి ని అభివృద్ధి చేస్తే ఆదాయాన్ని పెం చుకోవడమే కాకుండా రాష్ట్రానికి ఒక గుర్తింపు, గౌరవాన్ని తెస్తాయని అన్నారు.రంగారెడ్డి జిల్లా చిలుకూ రు బాలాజీ దేవస్థానం మార్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ప్రపంచ స్థా యి ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఎక్స్‌పీరియం పార్క్‌ను ముఖ్యమం త్రి ప్రారంభించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, కేంద్ర మాజీ మం త్రి, సినీ నటుడు చిరంజీవి, ఎంపీ లు అనిల్ కుమార్ యాదవ్, సీఎం రమేశ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డితో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులను, దుశ్చర్ల సత్యనారా యణలను సత్కరించారు. ఈ సం దర్భంగా సీఎంగారు మాట్లాడుతూ, “రాష్ట్రంలో విద్యార్థినీ విద్యార్థులం దరూ తమ తల్లి పేరుతో ఒక్కొక్క మొక్కను నాటి సంరంక్షించేలా కేం ద్రం తీసుకున్న కార్యక్రమం తరహా లో ప్రభుత్వం త్వరలోనే ఒక విధా నం తీసుకొస్తుందన్నారు. తెలం గాణలో సహజ వనరులు ఉన్నా ప్రభుత్వాలు ఇప్పటివరకు హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం రంగాలపై దృష్టి సారించలేదు. ప్రపంచ ప్రఖ్యా తి గాంచిన అద్భుతమైన ఆలయా లు ఉన్నప్పటికీ టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందలేదన్నారు.
దేవాల యాలను దర్శించుకోవాలంటే తమి ళనాడుకు లేదా ఇతర రాష్ట్రాలకు, ప్రకృతి సంపద, సహజ వనరులను చూడాలంటే మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు, హెల్త్ టూరిజంలో మరెక్కడికో వెళుతున్న పరి స్థితు లు ఉన్నాయన్నారు. కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావొచ్చు, నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావొచ్చు, కొల్లాపూర్ అటవీ ప్రాంతంలో కృష్ణా నదీ జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం గానీ, అక్కడ మందిరాలు.. ప్రకృతి సహజ వనరులకు కొదవ లేదని, వాటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్య తను ఇవ్వలేదని వ్యాఖ్యానిం చారు. వికారాబాద్ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి సాధిం చాలన్న లక్ష్యంతోనే దావోస్‌లో ఒక సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసిందని గుర్తు చేశారు. ఎక్స్‌పీరియం పార్క్‌ను నిర్మించిన రామ్‌దేవ్ రావుని అభినందిస్తూ, ఇది ఏడాది, ఏడాదిన్నర తర్వాత ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రం గా మారుతుందని, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి సాధించడానికి ప్రాతిపదికగా మారుతుందని తెలిపారు.