Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, బాల బాధితులకు చట్టపరరక్షణఅవసరం ఉంది

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అనే థీమ్‌ తో తమ బాధను చెప్పుకోలేని వారికి ర క్షణ కల్పించేందుకు ప్రస్తుత పరిస్థి తుల్లో రాష్ట్ర స్థాయి సమావేశం ఏ ర్పాటు చేయడం చాలా అవసరమ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా రు. శనివారం ఎమ్‌సీఆర్‌హెచ్‌ఆర్‌ డీలో బాలల లైంగిక వేధింపులు, ర క్షణ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం పాల్గొని ప్రసంగిం చారు.

ఎంతో కీలకమైన అంశంపై సదస్సు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీస్‌, ఇ తర నిర్వ హకులను సీఎం అభినం దించారు. ఇలాంటి నేరాలను ని యంత్రించడమే కాకుండా బాల బా ధితులకు చట్టపరమైన అన్ని రకాల రక్షణ కల్పించాల్సి ఉందని అభిప్రా యపడ్డారు. లైంగిక వేధింపుల నుం చి అన్ని రకాలుగా రక్షణ కల్పించా ల్సిన అవసరం ఉందని సీఎం అ న్నారు.

పిల్లలు, మహిళల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇ స్తుందని స్పష్టం చేశారు. బాలికల సంరక్షణ కోసం తెలంగాణ భరోసా ప్రాజెక్టును తీసుకొచ్చిందని, అను సంధానంగా 29 కేంద్రాలు పనిచేస్తు న్నాయని వెల్లడించారు. ఈ కేంద్రా ల ద్వారా పోలీసు సహాయమే కా కుండా న్యాయపరమైన సహాయం, వైద్య సహాయం, కౌన్సెలింగ్‌ వంటి సేవలను అందిస్తున్నాయని తెలిపా రు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తు న్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెం డ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అ న్నారు.

కేసులను వేగవంతంగా పరి ష్కరిం చడమే కాకుండా పిల్లలకు సంపూర్ణ రక్షణ, వారిలో విశ్వాసం, అభివృద్ధి కి అవసరమైన చర్యలు తీసుకోవడ మే ఈ కేంద్రాల లక్ష్యమని చెప్పుకొ చ్చారు. పోక్సో చట్టం, జ్యువెనైల్ చట్టాలు మన ప్రగతిశీల సాధనాలు గా పనిచేస్తున్నాయని, అయితే ఆ చరణలో కొన్ని సమస్యలు ఎదుర వుతున్నాయని అన్నారు. ఆ చట్టా లు బాధితులకు ఎలాంటి హాని కలి గించకుండా, వారి భవిష్యత్తుకు రక్ష ణగా సంపూర్ణ సహాయకారిగా ఉం డాలని ముఖ్యమంత్రి సూచించా రు. సోషల్ మీడియా ద్వారా పిల్లల పై జరిగే దురాఘతాలు, దుర్విని యోగం చేస్తున్న వారి పట్ల ఎలాంటి కరుణ చూపకుండా దోషుల విష యంలో కఠినంగా వ్యవ హరించాల ని ఆదేశించారు. ఇందుకు అవసర మైన చర్యలు తీసుకోవడానికి తె లంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.

న్యాయం కేవలం కోర్టుల్లోనే కాకుం డా ప్రతీ దశలోనూ రక్షణ ఉండాలని సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్, బాలల సంక్షేమ కేంద్రాలతో అన్ని ప్రక్రియల ద్వారా పిల్లలకు న్యాయం దక్కాలని, రక్షణ కల్పించాలని తె లిపారు. న్యాయమూర్తులు, పోలీ సు అధికారులు బాలల సంక్షేమ క మిటీలు, ఇతర అభివృద్ధి భాగస్వా మ్య సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తు న్నాను.
ఇలాంటి విషయాల్లో అందరం కలి సికట్టుగా ముందుకు సాగుదాం. న్యాయమంటే కేవలం శిక్షలు విధిం చడం వరకే కాదు. బాధితుల జీవి తానికి భరోసా కల్పించాలి. వారికి అవసరమైన రక్షణ, సమాజంలో త గిన గౌరవం కల్పించేలా చర్యలు తీ సుకుని వారి బాల్యాన్ని తిరిగి పొం దేలా చర్యలు ఉండాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.