— ఈ అర్ధరాత్రి తర్వాత ఖాతాల్లో రైతు భరోసా
CM Revanth : ప్రజా దీవెన కొడంగల్: ప్రజా పాలనలో భాగంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి నాలుగు నూతన సంక్షేమ కార్యక్రమాలను కొడంగల్ శాసనస భ నియోజ కవర్గం నుంచి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అం కితం చేశారు.జనవరి 26 న బ్యాం కులకు సెలవు రోజు అయినందున అర్థరాత్రి తర్వాత రైతు భరోసా కిం ద రైతు ఖాతాల్లో ప్రతి ఎకరాకు 6 వేల చొప్పున డబ్బు జమవుతుం దని సీఎం చెప్పారు. నారాయణ పేట జిల్లా కోస్గీ మండలం చంద్రవం చ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఈ సంక్షేమ పథకాలను పలువురు ఎంపికైన లబ్దిదారులకు పత్రాలను అందించడం ద్వారా ము ఖ్యమంత్రి ఈ సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే.. రాష్ట్రం లో అర్హులైన చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాలు అందుతా యని స్పష్టం చేశారు.ప్రజా పాలన అంటే అధికార యంత్రాంగం ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత, ప్రజా సమస్యలను పరిష్కరించి, ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్క రించాలి. అందుకే అధికారులను గ్రామాలకు పంపించాం. ఈరోజు రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇంది రమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, పేదల ఇండ్లకు ఉచిత కరెం ట్, వ్యవసాయనికి ఉచిత కరెంట్, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, రైతు రుణమాఫీ, ఏ కార్యక్రమమైనా అధి కారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అధికారులు వచ్చిందే మీ సమస్యలు తెలుసుకో వడానికి. కానీ కొందరు కావాలని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకు పూర్తి వివరాలు ఇవ్వండి. వాటన్నింటినీ క్రోడీకరించి సంక్షేమ పథకాలు అమ లు చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది.మార్చి 31 లోపు తెలంగాణలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతి సెగ్మెంట్ లో 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మం జూరు చేస్తాం.
ఇందుకు ప్రభుత్వం 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.రుణమాఫీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవ కాశాల కల్పన, ఆడబిడ్డలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణ సౌకర్యం, రూ. 500 లకే సిలిండర్, పేదవాడి ఇం టికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు సరిపోవు. పేదవారిని ఇంకా ఆదు కోవాలన్న ఆలోచనతోనే కొత్త సంక్షే మ పథకాలకు శ్రీకారం చుట్టాం.
ఏటా 20 వేల కోట్ల రూపాయలతో రైతు భరోసా కింద ఎకరాకు సంవ త్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. భూమి లేని దళితులు, గిరిజనులు, ఆది వాసీలు, బలహీనవర్గాలను ఆదు కోవడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం కింద ఏటా 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణ యించాం. ఈ పథకం కింద దాదా పు 10 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది.గత పదేండ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు. అధికారులెవ రూ గ్రామాల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. ప్రజా పాలనలో అధికారుల ను గ్రామాలకు పంపించి గ్రామసభ లు పెట్టి వివరాలు సేకరించమ న్నాం. ప్రతి ఆరు నెలలకు క్రమం తప్పకుండా అధికారులను గ్రామా లకు పంపిస్తున్నాం.కొత్త సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభిం చిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో పాటు ఉన్న తాధికారులు పాల్గొన్నారు.