Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : వేగిరంగా స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ

--నూత‌న ఓట‌ర్ల జాబితా రావాల్సి ఉంద‌న్న అధికారులు --జాబితా వచ్చిన వెనువెంట‌నే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించాలి --అధికారుల సమీక్షా సమావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

వేగిరంగా స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ

–నూత‌న ఓట‌ర్ల జాబితా రావాల్సి ఉంద‌న్న అధికారులు
–జాబితా వచ్చిన వెనువెంట‌నే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించాలి
–అధికారుల సమీక్షా సమావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: స్థానిక సంస్థ‌ల ( local body) ఎన్ని క‌ల ప్ర‌క్రియ‌ను వేగ‌ వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ( CM revanth reddy) అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర స‌చి వాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ ల‌పై శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు.

ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించ‌డానికి ఉన్న ఆటంకాలు ఏమిట‌ని ము ఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. భార‌త ఎన్ని క‌ల సంఘం (eci) నుంచి రా ష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి (sec) నూత‌న ఓట‌ర్ల జాబితా రావాల్సి ఉంద‌ని అధికారులు తెలిపారు. అందుకు ఎంత స‌మ‌యం ప‌డు తుంద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు.ఇప్ప‌టి కే రెండు రాష్ట్రాల‌కు ఈసీఐ జాబితా పంపింద‌ని, మ‌న‌తో పాటు మ‌రో ఆరు రాష్ట్రాల‌కు మ‌రో వారం లో జాబితాలు పంపిస్తుంద‌ని అధికారులు స‌మాధాన‌ మిచ్చారు.

జాబి తా రాగానే వెంట‌నే ఎన్నిక‌ల (ele ction) ప్ర‌క్రియ ప్రారంభిం చాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. వారంలోపే ఆయా స్థానిక సం స్థ‌ల‌కు త‌గిన‌ట్లు ఓట్ల‌ర్ల జాబితాలు రూపొందించాల‌ని ముఖ్య‌ మం త్రి రేవంత్ రెడ్డి సూచించారు.రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి బీసీ క‌మి ష‌న్ ( bc commission) సైతం నిర్దిష్ట గ‌డువులోగా త‌మ నివే దిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ ర్పించాల‌ని ముఖ్య‌ మంత్రి ఆదేశించారు.

ఈ స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ‌, పంచా య‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క‌, బీసీ సంక్షేమ‌ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, బీసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ వ‌కుళాభ‌రణం కృష్ణ‌మోహ‌న్‌రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్య‌ద‌ర్శులు చంద్రశేఖర్ రెడ్డి, వేముల శ్రీ‌నివాసులు, సంగీత స‌త్య నారాయ‌ణ‌, అజిత్ రెడ్డి, అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ సుద‌ర్శ‌న్‌రెడ్డి పాల్గొన్నా రు.

Cm Revanth Reddy