టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు
–అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణకు తలమానికమైన యాద గిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Rev anth Reddy) కీలక ఆదే శాలు జారీ చేశారు. టీటీడీ ( ttd) బోర్డు తరహా లో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేప ట్టాలని చెప్పారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ( yadadri temple devel opment) పెండింగ్ పనుల నీవేదిక స మర్పించాలని సూచించా రు. భక్తులకు సౌకర్యాలు , భవిష్యత్ అవ సరాలను దృష్టిలో ఉంచు కుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలని తెలి పారు. ఆలయ రాజగోపురానికి (Rajagopuram) బంగారు తాప డం పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలే య డానికి ఆస్కారమివ్వవద్దని అన్నారు.ఆలయ అభివృద్ధిని మరో స్థా యికి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. వైటీడీఏ ( ytda) , యాద గిరి గుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు (report) తనకు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
CM Revanth Reddy