CM.Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలి యజేశారు. దేశంలో రెండో అతి పెద్ద ఆదివాసీ వేడుకలో ఆధ్యాత్మక వెలుగులు నింపే ఆదిశేషువు కరు ణాకటాక్షాలు అందరిపైనా ఉండా లని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. వనమే ఆలంబనగా అత్యంత ని యమ నిష్టలతో ఆదివాసీలు అం దరు జరుపుకునే వేడుక “నాగోబా జాతర” అని, గిరిజన సోదర, సోద రీమణులు అందరికీ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. పుష్య అమా వాస్య నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర వెల్లి మండలం కేస్లాపూర్లో అంబరాన్నంటే ఈ ఆదివాసీ సం బురం తెలంగాణ సాంస్కృతిక వైభ వమని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక సందేశం విడుదల చేశా రు.
కాగా, నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపం చంలోనే అతిపెద్ద గిరిజన మహా జాతర ఇది. గోండుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక నాగోబా జాతర, ఆదివాసీ, గిరిజనులు ఈ జాతరను ఘనంగా జరుపుకుం టారు. ఈ రోజు మంగళవారం రాత్రి నాగోబాకు మెస్రం వంశీయు లు మహాపూజ చేయనున్నారు. ఫిబ్రవరి 4 వరకు కేస్లాపూర్లో నాగోబా జాతర జరగ నుంది. ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 600 మంది పోలీసు లు,100 సీసీ కెమెరాల నడుమ జా తరకు అధికారులు పటిష్ట ఏర్పా ట్లు చేశారు. ఈ జాతరకు తెలంగా ణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుం టారు.