CM Revanth Reddy: ప్రఖ్యాత అడోబి సిస్టమ్స్ (Adobe Systems) సీఈవో శంతను నారాయణ్‌తో (Shantanu Narayan) ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబ డులు తేవడమే లక్ష్యంగా అమెరి కాలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి (CM Revanth Reddy)గారు ప్రస్తుతం కాలిఫోర్నియాలో పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లలో సమావేశాలు, చర్చలు జరుపుతు న్నారు. అడోబీ సీఈవోతో సమావే శంలో సీఎం తోపాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu), ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రజాప్ర భుత్వం తలపెట్టిన హైద రాబాద్ 4.0, ఫ్యూచర్ సిటీ నిర్మా ణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూ నివర్సిటీ స్థాపన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ (Hyderabad 4.0, Building Future City, Establishment of Young India Skills University, Artificial Intelligence City) ఏర్పాటు తదితర ప్రణాళికలపై ఆసక్తి కనబర్చిన శంత ను నారాయణ్ ప్రాజెక్టుల్లో భాగస్వా ములు కావడానికి అంగీకరించారు. స్ఫూర్తిదాయకమై వ్యక్తి, సిలికాన్ వ్యాలీలో అత్యంత గౌరవనీయులైన టెక్ విజనరీ శంతను నారాయణ్ ని కలవడం భావోద్వేగమైన అనుభూ తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచానికి హైదరాబాద్ అందించిన ప్రసిద్దుల్లో ఒకరు శాంత ను నారాయణ అని సీఎం పేర్కొ న్నారు.