CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారని, జరుగుతున్న పరి ణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తూ ప్రపంచమంతా ఒప్పు కుంటోందని, తెలంగాణ రైజింగ్ హైదరాబాద్ రైజింగ్ ఇక ఆగదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ధీ మా వ్యక్తం చేశారు.హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్స్ గ్లోబల్ డెలివరీ సెంటర్ (HCL Tech’s Global Delivery Center)ను ముఖ్యమంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ముఖ్యమం త్రి మాట్లాడుతూ “ప్రస్తుతం హైదరా బాద్, తెలంగాణ దేశంలోనే వేగం గా అభివృద్ధి చెందుతున్న నగరం గా, రాష్ట్రంగా మారిందని చెప్పా రు. హైదరాబాద్ పోటీ ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు నగరా లతో కాదని, ప్రపంచ స్థాయి నగరా లతో తమ పోటీ అని అన్నప్పుడు అదో పెద్ద కలగా అభివర్ణించారు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్స హిస్తున్న తీరు నంబర్ 1 గా నిలిచి నప్పుడు, రాష్ట్రాన్ని డేటా సెంటర్ల హబ్‌గా, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్, స్కిల్ డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ రంగాల్లో తెలంగాణను మార్గదర్శి గా మార్చినప్పుడు ఇప్పుడు అంద రూ అంగీకరిస్తున్నారు. ఇక హైదరా బాద్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ ఆగదన్నారు. బహుళజాతి కంపె నీలతో ప్రతి రోజూ అవగాహన ఒ ప్పందాలు కుదుర్చుకోవడం లేదా పెద్ద పెద్ద సంస్థలు Hyderabad కు రావడం లేదా గతేడాది కుదుర్చుకు న్న ఎంఓయూల మేరకు సరికొత్త సౌకర్యాలతో సిద్ధమైన కేఆర్‌సీ సెంటర్ (HCL Tech KRC Cam pus ) ను ప్రారంభించడం గర్వకార ణంగా ఉందని చెప్పారు. కేవలం ఏడాది కాలంలోనే Telangana అంతర్జాతీయ, దేశీయ అత్యధిక పెట్టుబడులను ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
ఆర్టిపీషి యల్ ఇంటెలిజెన్స్‌ను ముందుగా అందిపుచ్చుకున్నాం. పైగా రాష్ట్రం లో తక్కువ ద్రవ్యోల్బణాన్ని కాపా డుకున్నామని వివరించారు. తెలం గాణను 1 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన రాష్ట్రంగా మార్చుతామని చెప్పినప్పుడు కొందరు సాధ్యం కా దన్నారు. కేవలం దావోస్ లో జరిపి న రెండు వ్యాపార పర్యటన ల్లో 40 వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు, 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అ త్యుత్తమ లైఫ్ సైన్సెస్ సంస్థల్లో ఒకటైన ఆమ్‌జెన్ (Amgen)ను హైదరాబాద్‌కు ఆహ్వానించాం. ప్రపంచంలోనే అత్తుత్తమ జీవ వైవిధ్య సదస్సుల్లో ఒకటైన బయో ఏషియా 2025 ( Bio Asia 2025)ను విజయవంతంగా నిర్వహించామని, ఇప్పుడు హెచ్ సీఎల్ క్యాంపస్‌ను ప్రారంభిస్తు న్నామన్నారు. 60 దేశాల్లో డిజి టల్, ఇంజనీరింగ్, క్లౌడ్, AI రంగా ల్లో 2.2 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెచ్ సీఎల్ టెక్నాలజీస్ దేశ గౌరవాన్ని పెంచిందని తెలిపారు. 2007 లో హైదరాబాద్‌లో తొలిసారి ప్రారం భమైనప్పటి నుంచి అభివృద్ధి సాధి స్తూ ప్రస్తుతం 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 వేల మంది ఉద్యోగులతో ప్రపంచస్థాయి సరికొ త్త సదుపాయాలతో హైదరాబాద్ హెచ్‌ఎసీఎల్ (HCL Tech) అద్భు తమైన విజయాలను సాధించబో తోందని వివరించారు. ఈ కార్యక్ర మంలో HCL సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సి. విజయ్ కుమార్, సీవీపీ, డిజిటల్ బిజినెస్ గ్లోబల్ హెడ్ పవన్ వాడపల్లి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు పలువురు ప్రము ఖులు పాల్గొన్నారు.