ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో శనివారం సుడిగాలి పర్య టన నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలo బ్రాహ్మ ణవెల్లెంల లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. దీంతో రెండు దశాబ్దాల కల సాకారమైంది. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాం తాలకు సాగు, తాగు నీటిని అం దించడమే లక్ష్యంగా 2005 ఆగ స్టులో అప్పటి సీఎం వైఎస్ రాజశే ఖర్ రెడ్డి ఉదయ సముద్రం ఎత్తి పోతల పథకానికి శంకుస్థాపన చేశారు.2007లో రూ.699 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రా రంభమయ్యాయి. 6.70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నార్కట్‌పల్లి, న ల్గొండ, చిట్యాల, మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం, కట్టం గూరు, నకిరేకల్, తుంగతుర్తిలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందిం చడానికి వీలుగా నిర్మాణం చేశారు. 2015, 2021లో ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాన్ని సవరించారు.
ఇప్పటిదాకా రూ.469.95 కోట్లను వెచ్చించారు. మరో రూ.204.72 కోట్ల పనులు జరగాల్సి ఉంది. ఉదయ సముద్రం ప్రాజెక్టులో భాగంగానే 0.302 టీఎంసీల సామర్థ్యంతో బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించారు. హెడ్‌వర్క్‌లతో పాటు అప్రోచ్ చానల్, ప్రెషర్ మెయిన్ పనులు పూర్తయ్యాయి. ఈ రిజ ర్వాయర్ కింద ఎడమ ప్రధాన కా లువ కింద 43 వేల ఎకరాలు, కుడి ప్రధాన కాలువ కింద 57 వేల ఎక రాలకు సాగునీటిని అందిస్తారు. తొలిదశలో మునుగోడు కింద 2,9 08 ఎకరాలు, నల్గొండ నియోజ కవర్గంలో 22,750 ఎకరాలు, నకి రేకల్‌లో 23 వేల ఎకరాలకు సాగు నీటిని అందించనున్నారు. కాగా శనివారం సీఎం స్వయంగా వెల్లంల ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు.
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండ లం బ్రాహ్మణ వెళ్లెముల వద్ద ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాన్ ను ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి, దామోదర రాజ నర్సింహ, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ చామ ల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేము ల వీరేశం, మందుల సామ్యే ల్ తదితరులతో కలిసి ఆవిష్కరిం చారు.
యాదాద్రి ధర్మ స్టేషన్ జాతికి అoకితం… యాదాద్రి థర్మల్ స్టేషన్ లోని 800 మెగావాట్ల యూనిట్ 2 ని, థర్మల్ స్టేషన్ లోని పైలాన్ ను ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు,ఎంపీ రఘువీర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికా రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల అనంతరం ఈ సాయంత్రం నల్లగొండలో మెడికల్ కాలేజ్ ప్రారంభించి అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొనను న్నారు.