ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నలగొండ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయుట ,నలగొండ పట్టణానికి మాస్టర్ ప్లాన్ ఆమోదిం పచేసి సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించుట, మరియు ఇతర స్థానిక సమస్యల పరిష్కారం చేయాలని నల్లగొండ పట్టణ సిపిఎం కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కోరింది. ఈ మేరకు సిపిఎం నాయకులు జూలకంటి రంగారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సయ్యద్ ఆషం మహమ్మద్ సలీం దండంపల్లి సత్తయ్య లు కోరారు. పట్టణానికి 1987లో జీవో నెంబర్ 594 ద్వారా మాస్టర్ ప్లాన్ ఆమోదింప చేసినారు ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ మార్పులు చేయాల్సి ఉన్న 38 సంవత్సరాలు అవుతున్న ఎలాంటి మార్పు జరగలేదు 2014 మాస్టర్ ప్లాన్ అప్రూవల్ కొరకు కమిటీ వేసి బ్లూ ప్రింట్ తయారు చేసినారు దానిపై అభ్యంతరాలు స్వీకరించగా 245 పైగా వచ్చినవి అభ్యంతరాలను పరిశీలించి ఆమోదింప చేయడంలో అధికారులు నిర్లక్ష్యం కనబడుతున్నది.
నల్లగొండ పట్టణ అభివృద్ధికి కావలసిన ప్రధానమైన నల్గొండ మాస్టర్ ప్లాన్ ఆమోదానికి ఉన్న ఆటంకాలను సమీక్షించి వెంటనే ఆమోదింప చేయడానికి కావలసిన తగు చర్యలు తీసుకోని అభివృద్ధికి అధిక నిధులు కేటాయించవలసిందిగా కోరుతున్నాం. గత 25 సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన పరిస్థితి లేకపోవడంతో జీవనోపాధి కోసం గ్రామాల నుండి నల్గొండ పట్టణానికి వలస వచ్చి రోజుకు వారి కూలీ చేసుకునే ఇల్లు లేని పేదలు సుమారు పట్టణంలో 20వేల మంది ఉన్నారు. ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాల చొప్పున పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయించగలరు నల్గొండ పట్టణంలో 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించి స్వాధీన పరచాల్సిందిగా కోరుతున్నాం.
అంతే నలగొండ పట్టణం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుటకు అవసరమైన రవాణా సౌకర్యం కల్పించుటకు పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలి జిల్లా కేంద్ర పట్టణమైనందున ప్రభుత్వం విద్య వైద్యం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ బడుల కు పక్కా భవనాలు జిల్లా కేంద్ర హాస్పిటల్ లో పడకల సంఖ్య పెంపు పెరుగుతున్న జనాభా కలుగునంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలి పట్టణంలో ఆహ్లాదాన్ని పెంచేందుకు పానగల్లు ఉదయం సముద్రం చుట్టూ మినీ ట్యాంకుబండ్ నిర్మాణం చేసి పానగల్లు ను పర్యాట కేంద్రంగా మార్చుటకు అవసరమైన నిధులు కేటాయించగలరని కోరుచున్నాము.
డిమాండ్స్
1 నల్గొండ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయాలి
2, నల్గొండ పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ ఆమోదింప చేయాలి
3 లాటరీ ద్వారా ఎంపిక చేసిన 552 మంది లబ్ధిదారులకు వెంటనే స్వాధీన పరచాలి
4 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మంచినీరు మురికి కాలువలు వీధిలైట్లు తదితర మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలి
5 ఇండ్లు లేని పేదలకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాల చొప్పున పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
6 నలగొండ పట్టణంలో పూలు మరియు పండ్లకు ప్రత్యేక మార్కెట్ నిర్మాణం చేయాలి
7 పానగల్లు అద్దంకి బైపాస్ ప్రాంతంలో చాపల మార్కెట్ నిర్మాణం చేయాలి
8 నల్గొండ పట్టణంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం స్థలం కేటాయించబడింది సొంత బిల్డింగ్ నిర్మాణం చేయాలి
9 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కవర్ గాని పానగల్లు, పెద్ద బండ, ఏ ఆర్ నగర్, మహిళా ప్రాంగణం, మరియు పట్టణంలో విలీన గ్రామపంచాయతీ తదితర ప్రాంతాలకు విస్తరించాలి.
10 లతీఫ్ ఉల్లా కాద్రి గుట్టపైకి పాత డిజైన్ ప్రకారమే గుట్టపైకి రోడ్డు వేయాలి
11 పానగల్లును పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధికి నిధులు కేటాయించాలి
12 నల్లగొండ పట్టణంలో అన్యాక్రాంతం అవుతున్న వక్బుభూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కోసం ఉపయోగించాలి
13 జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ పడకల సంఖ్య పెంచాలి ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు ఇతర సిబ్బందిని నియమించాలి టెస్టుల కోసం అధునాతన పరికరాలు ఏర్పాటు చేసి టెక్నీషియన్స్ నియమించాలి
14 నలగొండ పట్టణంలోని అన్ని రకాల స్మశాన వాటికల మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలి
15 పవర్లూమ్ కార్మికులను వర్కర్ ను యజమాని చేసే వర్కర్ టు ఓనర్ సిరిసిల్ల పథకాన్ని నల్గొండ పట్టణానికి వర్తింప చేయాలి