–ఆక్రమణలన్నింటినీ వరుస క్రమం లో తొలగిస్తాం
–విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నాం
–మున్నేరు రిటర్నింగ్ వాల్ ఎత్తు పెంచాల్సిన అవసరం ఉంది
–మంత్రులంతా ప్రజలతోనే ఉన్నా రని ముంపు ప్రాంతాల పర్యటనలో సీఎం రేవంత్ వెల్లడి
CM Revanth Reddy: ప్రజా దీవెన, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విపత్తు చూసి చలించిపోయానని, ప్రకృతిని విధ్వంసం చేయడంతోనే ఈ ప్ర మాదం సంభవించిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. మంగళవారం పర్యటనకు వెళ్లే ముందు కాసేపు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అనేక నగరాల్లో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, ఖమ్మం నగరంలో కూడా గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలకు గురికావడంతో పెద్ద స్థాయిలో వరదలు వచ్చాయని, భారీ నష్టం కలిగిందన్నారు. ప్రస్తు తానికి గొలుసు కట్టు చెరువులు మాయమయ్యాయని చెప్పారు. ఖమ్మం నగరంలో మున్నేరు నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు ముం పు కాకుండా రిటైర్నింగ్ వాల్ ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఇంజనీర్లతో (with engineers) మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy)అన్నారు. రిట ర్నింగ్ వాల్ నిర్మిస్తే ఖమ్మం ముంపు నుంచి బయట పడుతుందని చె ప్పారు. ఆ దిశగా చర్యలు తీసు కుంటానని ప్రజలకు హామీ ఇచ్చా రు.
ఆక్రమణల అంతుచూస్తాం..
ఖమ్మం నగరంలో సర్వే ఆఫ్ ఇం డియా మ్యాప్ప్ (Survey of India Mapp) ద్వారా చెరువు లను గుర్తించి, ఆక్రమణలు తొల గిస్తామని సీఎం తెలిపారు. ఇందు కు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. చెరువులు పునరుద్ధర ణకు చర్యలు తీసుకుంటామ న్నా రు. మిషన్ కాకతీయ ద్వారా చెరు వులు పటిష్టం చేశామని , గతంలో తెగని చెరువులు , ఇప్పుడు ఎందు కు తెగుతున్నాయని అన్నారు. 75 ఏళ్ల తర్వాత ఖమ్మంలో 75 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని, 42 సెంటీ మటర్ల వర్షం పడిందని సీఎం చె ప్పారు. ఎంతో విపత్తు జరిగినా ప్రా ణ నష్టాన్ని తగ్గించామని చెప్పారు. ఇది ప్రభుత్వం ముందు చూపే అని అన్నారు.
పువ్వాడ ఆక్రమణలు తొల గించాలని హరీశ్‌కు చెప్పండి
వరదలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao)పెద్ద పెద్ద మాటలు మాట్లా డుతున్నారని, బీఆర్ఎస్ (brs)నాయ కుడు పువ్వాడ అజయ్ కాలువ ఆక్రమించి హాస్పటల్ నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పు వ్వాడ ఆక్రమణలను హరీశ్ రావు (Harish Rao)దగ్గరుండి తొలగించేలా ప్రజలు గుర్తు చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరిగిన విపత్తుపై కేంద్రానికి లేఖ రాశామని, మృతుల కుటుంబాలకు ఐదు లక్ష ల రూపాలయ ఎక్స్‌గ్రేషియా ఇచ్చా మని సీఎం అన్నారు. మా మంత్రు లంతా ప్రజలతోనే ఉన్నారన్నారు. ఇలాంటి విపత్తుల సమయంలో గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలు అమలు చేయ లేదని విమర్శించారు. మాది చేతల ప్రభుత్వం అన్నారు. ప్రజలకు ఏదీ కావాలన్నా మమ్మల్ని అడుగుతార ని, నిలదీస్తారని, ఫామ్ హౌస్‌లో ఉన్న వారిని ఎందుకు నిలదీస్తార న్నారు. ప్రత్యేకంగా విపత్తు నిర్వ హణ సంస్థను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.