–భూ సమస్యలన్నింటినీ తీర్చేలా కొత్త చట్టం
–ఏ మాడ్యూల్‌లో దరఖాస్తు చేసి నా పరిష్కారం
–నేడు క్యాబినెట్ భేటీలో ఆమోదిం చే అవకాశం
–సాదా బైనామా భూములకూ పరి ష్కారం
–గురు, శుక్రవారాల్లో అసెంబ్లీలో సవరణ బిల్లు
–రైతులు అప్పీలుకు వెళ్లేందుకు ట్రైబ్యునళ్లు
–ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలని నిర్ణయించిన ఆర్‌వోఆర్ చట్టానికి రంగం సిద్ధ మైంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును గురు, లేదా శుక్రవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపె ట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టంలో భాగంగా ధరణి స్థానంలో ‘భూమాత’ను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త ఆర్‌వోఆర్ చట్టం, అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుపై ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరణిలోని లోపాలను సవరిస్తూ.. కొత్త ఆర్‌వోఆర్ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ అంశంపై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేశారు. సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లు కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతరం అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత గవర్న ర్ ఆమోదం కోసం పంపించను న్నారు. గవర్నర్ ఆమోదం అనంత రం కొత్త చట్టం అమల్లోకి రానుంది. కాగా, కొత్త ఆర్‌వోఆర్ చట్టంలో భా గంగా ప్రస్తుతం ధరణిలో ఉన్న అనే క అంశాల్లో మార్పులు, చేర్పులు చేయనున్నారు. ప్రజలకు మరింత మేలు జరిగేలా దీనిని రూపొంది స్తున్నారు. రైతులకు తమ భూము లకు సంబంధించి ఉన్న చాలా సమస్యలకు ప్రస్తుతం ధరణిలో పరిష్కారం లభించడం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేలా ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ధరణిలో 33 మాడ్యూల్స్ ఉన్నాయి.
ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే.. దరఖాస్తు సమయంలో సమస్య ఒకటై ఉండి, మాడ్యూల్ లో మరో దానిని ఎంపిక చేస్తే ఆ దరఖాస్తునే తిరస్కరిస్తున్నారు. దీంతో కొత్త చట్టంలో ఏ మాడ్యూ ల్‌లో దరఖాస్తు చేసినా సమస్యను పరి ష్కరించడానికి వీలుగా చర్య లు తీసుకుంటున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు అధికారిదే బాధ్యతగా నిర్ణయించబోతు న్నారు. భూ సమస్యల పరిష్కా రానికి సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ధరణిలో సమస్య పరిష్కారం కాకపోతే.. సదరు రైతు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి రైతులు కోర్టులకు వెళ్లాల్సి ఉంది. అయితే.. కోర్టుకు వెళితే సమస్య పరిష్కారం కావడానికి అనేక ఏళ్లు పడుతోంది.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త చట్టంలో భాగంగా భూమా తలో పరిష్కారం కాని సమస్యపై అప్పీలుకు వెళ్లడానికి వీలుగా ప్రత్యేక ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అధికా రుల స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే.. ఈ ట్రైబ్యునళ్లను ఆశ్ర యించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎటువంటి డాక్యుమెంట్లు లేని గ్రామకంఠం వంటి భూములకు విలువ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి భూములను రిజిస్ట్రేషన్ చేసేలా, వాటికి బ్యాంకు రుణాల ఇచ్చేలా కొత్త చట్టంలో రూపకల్పన చేస్తున్నారు.
దీంతోపాటు సాదా బైనామా భూములకు కూడా పరిష్కారం చూపే విధంగా కొత్త చట్టంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వీఆర్‌వో వ్యవస్థను కూడా అమలు పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారిని ఎలా ఉపయోగిం చుకోవా లనేఅంశంపై మంత్రివర్గంలో చర్చిం చిన తర్వాత విధి విధానాలు రూపొందించే అవకాశం ఉంది.