–కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు క్షమాపణలు చెప్పాలి
–ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు కనపడట్లేదు –దేవుడు మంచి బుద్ధి ప్రసాదించా లని మాత్రమే ప్రార్థించగలం
–తండాలలో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి
–అసెంబ్లీ చర్చలో రెచ్చిపోయిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణపై మో దీ కనుసన్నల్లోనే కేంద్రం వివక్ష (Discrimination of the center)చూ పిందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అసెంబ్లీ సమావేశాల రెండో రోజైన బుధవారం ఆయన అసెంబ్లీలో (assembly) మాట్లాడుతూ కేంద్రం తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌ని ప్రస్తావిస్తూ తెలంగాణకు నిధులు కేటాయించలేదని, దీనికి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాం డ్ చేశారు. ఇక బిఆర్ఎస్ విష యానికి వస్తె ప్రజలు శిక్షించినా బీఆ ర్ఎస్ నేతలు (brs) మారడం లేదని వ్యా ఖ్యానించారు. అసెంబ్లీలో సీఎం గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిం చారు.
దేవుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించుగాక అని మాత్రమే ప్రార్థించగలమన్నారు. పంచాయ తీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదని సీఎం రేవంత్ అన్నా రు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు (Beatty Roads)వేస్తామని తెలిపారు. తండాలకు 100 శాతం రోడ్లు వేయాలని నిర్ణయించామని, తండాలకు విద్యుత్ (electricity) సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల ఇళ్లకు తాగు నీరు ఇవ్వలేదని ఆరోపించారు. తండాలు, గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి అన్నారు.కాగా, అంతకుముందు నిరుద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో (Both Houses) వాయిదా తీర్మానం కోరుతూ బీఆర్ఎస్ నోటీసు ఇచ్చిందని, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటనతోపాటు ఇతర న్యాయ పరమైన డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రద ర్శిస్తున్న వైఖరి, నిరుద్యోగుల ఆందో ళనలపై ప్రభుత్వ అణచివేత వైఖ రిపై చర్చ చేపట్టాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది. స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు (Speaker Prasad Kumar) కేటీఆర్ (ktr)ఈ నోటీసు ఇచ్చారు.