–కొనుగోళ్ళ పై కమిషన్ను రద్దు కాలేదు
–చైర్మన్ని మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు సూచించింది
–కేసీఆర్ హయాంలో ఒక్క యూని ట్ కూడా సోలార్ ఉత్పత్తి కాలేదు
–విద్యుత్ కొనుగోళ్లలో వేల కోట్ల అవినీతి, అక్రమాలు
–విద్యుత్ కమిషన్ విచారణపై బీఆ ర్ఎస్కు ఎందుకు ఉలికిపాటు
–సాయంత్రం లోగా కొత్త చైర్మన్ వస్తారన్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలోనే సంచలనం సృష్టించిన విద్యుత్ కొనుగోళ్లపై జ్యూడిషియల్ కమిషన్ (Judicial Commission)విచారణ కొనసాగుతోంద ని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పున రుద్ఘాటించారు. ఇవ్వాలంటే ఇవ్వాలే సాయంత్రంలోగా కొత్త చైర్మ న్ వస్తారని తెలిపారు. విద్యుత్ విచారణ కమిషన్ ను రద్దు చేయా లని కేసీఆర్ కోర్టుకెళ్లారని, సుప్రీం కోర్టు విద్యుత్ కమిషన్ ను రద్దు చేయలేదని, విచారణ కమిషన్ చైర్మన్ ను (Commission Chairman) మార్చి విచారణ చేయా లని సూచించిందని గుర్తు చేశారు. కమిషన్ వివరాలు అడిగితే కేసీఆర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన జరిగేటప్పుడు తెలంగాణ కు 54 శాతం విద్యుత్ కేటాయింపు లు చేశారని, విద్యుత్ కేటాయింపు (Allocation of electricity)ల కోసం జైపాల్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రారంభించి న విద్యుత్ ప్లాంట్లను కేసీఆర్ పూర్తి చేశారన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క యూనిట్ కూడా సోలార్ పవ ర్ ఉత్పత్తి చేయలదేని మండిపడ్డా రు. విద్యుత్ విచారణపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు జంకుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. విద్యు త్ కొనుగోళ్లలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ నేతలపై సీఎం ఫైర్.. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ (BRS party)నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసు కుని రాష్ట్రానికి అన్యాయం చేశార ని ఆరోపించారు. పవర్ ప్లాంట్ లు బీహెచ్ఈఎల్ కు ఇస్తున్నామని చెప్పి వాళ్ల నుంచి సివిల్ కాంట్రా క్టులు వీళ్ల బినామీలకు ఇప్పించి కమిషన్లు తీసుకున్నారని మండి పడ్డారు. సబ్ క్రిటికల్ నుంచి సూపర్ క్రిటికల్ (Subcritical to supercritical)కు అప్ గ్రేడ్ చేయాలని కేం ద్రం సూచిస్తే కమీషన్లకు కక్కుర్తి పడి సబ్ క్రిటికల్ యంత్రాగాన్ని కొనుగో లు చేసి వాటికి టెండర్లు పిలిచి వాటితో పవర్ ప్లాంట్ కట్టించార న్నారు.
అక్కడ ఎప్పుడూ సమస్య లే… ఎప్పుడూ భద్రాద్రి పవర్ ప్లాంట్(Bhadradri Power Plant) లో ఏదో ఓ సాంకేతిక సమ స్య తలెత్తుతూ వస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. రెండున్నర ఏళ్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును తొమ్మి దున్నర ఏళ్ల గడుస్తున్నా పూర్తి చే యలేదని విమర్శించారు. గుజరాత్ కు చెందిన కంపెనీ నుంచి రూ. వె య్యి కోట్ల కమిషన్లు తీసుకుని పవ ర్ ప్రాజెక్టులు కట్టారని చెప్పారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా ఇలాగే చేశారని సీఎం మండిపడ్డా రు. నిజాలు చెబితే బుకాయించే పనులు చేస్తున్నారని సోనియా దయతో జైపాల్ రెడ్డి (Jaipal Reddy) కృషితో ఇప్పు డు తెలంగాణ వెలుగులు చిమ్ము తుందని వెల్లడించారు.