— మందకృష్ణ తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ప్రజా దీవెన హైదరాబాద్:రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాది గ, మాదిగ ఉపకులాలకు మేలు చే యాలనే మంచి ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ , మాదిగ ఉపకులాల ప్రతినిధులు ముఖ్యమంత్రితో స మావేశమయ్యారు. ఎస్సీ ఉపకు లాల వర్గీకరణకు ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు ఎదురు కావొ ద్దన్న ఆలోచనతో ప్రక్రియను చట్ట బద్దంగా ముందుకు తీసుకువె ళ్లామని, అందులో భాగంగానే తొ లుత అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీని నియమించడంతో పాటు న్యాయ కమిషన్ కూడా ఏర్పాటు చేశామని వివరించారు. సాధ్యమైనంత తొందరగా సదరు నివేదికలను తెప్పించి, కమిషన్ సిఫార్సులను కేబినెట్ లో, ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదించా మని సీఎం గుర్తుచేశారు.
ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబె ట్టుకున్నారని మంద కృష్ణ ఈ సం దర్భంగా అభినందించారు. వర్గీకర ణ ప్రక్రియను ఒక నిబద్ధతతో చేప ట్టిన ప్రజా ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఒక సోదరుడి గా అండగా ఉంటానని మందకృష్ణ తెలిపారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమస్యలు, అభ్యంత రాలను కేబినెట్ సబ్ కమిటీతో పా టు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలు వురు ప్రజా ప్రతినిధులు, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొ న్నారు.