Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM revanth reddy RRR : జాతీయ ర‌హ‌దారిగా ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగo

--కేంద్రమంత్రికి రాష్ట్ర ప్రభుత్వo తరపున విన్నపం --హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు లైన్స్ గా విస్త‌రించాలి --జాతీయ ర‌హ‌దారుల ప‌నులు వెంట‌నే ప్రారంభించాలి --కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బృందం విజ్ఞ‌ప్తి

జాతీయ ర‌హ‌దారిగా ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగo

–కేంద్రమంత్రికి రాష్ట్ర ప్రభుత్వo తరపున విన్నపం
–హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు లైన్స్ గా విస్త‌రించాలి
–జాతీయ ర‌హ‌దారుల ప‌నులు వెంట‌నే ప్రారంభించాలి
–కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బృందం విజ్ఞ‌ప్తి

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధాని ప్రాంతీయ రింగు రోడ్డు (rr r) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని, హైద‌రాబా ద్, విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు వ‌రుస‌లుగా విస్త‌రిం చా ల‌ని జాతీయ ర‌హాదారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి( Nithin gadgari) ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గ సహచరులు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, ఆర్అండ్ బీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌ బాబు, పెద్ద‌ప‌ల్లి ఎంపీ వంశీ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ల తో కలిసి బుధ‌వారం భేటీ అయ్యా రు.

ఈసంద‌ర్భంగా రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల ( national hyw ays) విస్త‌ర‌ణ‌, నూత‌న జాతీయ ర‌హ‌దారుల ప్ర‌క‌ట‌న‌, ఇప్ప‌టికే జాతీయ ర‌హ‌దారులుగా ప్ర‌క‌టించిన మార్గాల ప‌నుల ప్రారంభం త‌దిత‌ర విష‌యాల‌ను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లా రు. సంగారెడ్డి నుంచి నర్సా పూర్‌, తూప్రాన్‌, గ‌జ్వేల్‌, జ‌గ‌దేవ్‌ పూర్‌, భువ‌న‌గిరి, చౌటుప్ప‌ల్ (158.645 కి.మీ.) ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించార‌ ని, దాని భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో స‌గభాగాన్ని త‌మ ప్ర‌భు త్వ‌మే భ‌రిస్తోంద‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌ మంత్రి వివ‌రించారు.

ఈ భాగంలో త‌మ వంతు ప‌నులు వేగ‌ వంతం చేశామ‌ని తెలిపారు. చౌటు ప్ప‌ల్ నుంచి అమ‌న్‌గ‌ల్‌, షాద్‌న‌గ‌ర్‌, సంగారెడ్డి వ‌ర‌కు (181. 87 కి.మీ.) ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించాల‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ( CM revanth re ddy) కోరారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగా న్ని జాతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌టించి, ఈ ఏడాది ఎన్‌హె చ్ఏఐ వార్షిక ప్ర‌ణాళిక‌లో నిధులు మం జూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

హైద‌రాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్ష‌న్) నుంచి వ‌లిగొండ‌, తొర్రూర్, నెల్లి కుదురు, మ‌హ‌బూబాబాద్‌, ఇల్లెం దు, కొత్త‌గూడెం వ‌ర‌కు ర‌హ‌ దారిని (ఎన్‌హెచ్‌-930పీ) జాతీయ ర‌హ‌ దారిగా ప్ర‌క‌టించార‌ని, ఇందులో కేవ‌లం ఒక ప్యాకేజీ కింద 69 కి.మీ. ల‌కు టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారం భించార‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ దృ ష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు.

హైద‌రాబాద్ వాసులు భ‌ద్రాచ‌లం వెళ్లేందుకు 40 కి.మీ. దూరం త‌ గ్గించే ఈ ర‌హ‌దారిని జైశ్రీ‌రామ్ రోడ్‌గా వ‌రంగ‌ల్ స‌భ‌లో నితిన్ గ‌డ్క‌ రీ చెప్పిన విష‌యాన్ని ముఖ్య‌మంత్రి గుర్తుచేశారు.ఈ ర‌హ‌దారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండ‌ ర్లు పిలిచి నందు న వెంట‌నే ప‌నులు ప్రారంభిం చాల‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీకి ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

*రెండు రాజ‌ధానుల మ‌ధ్య ర‌హ‌దారి ప‌నులు చేపట్టాలి..*
హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ (ఎన్‌ హెచ్ 65) జాతీయ ర‌హ‌దారిని 2024, ఏప్రిల్‌లోగా ఆరు వ‌రుస‌లుగా విస్త‌రించాల్సి ఉంద‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ దృష్టికి ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లా రు. రెండు రాష్ట్రాల రాజ‌ధానుల మ‌ధ్య కీల‌క‌మైన ఈ ర‌హ‌దారిలో రోజుకు 60 వేల‌కుపైగా వాహ‌నాలు రాక‌పోక‌లు సాగిస్తున్నాయ‌ని, వాహ‌నాల ర‌ద్దీతో ప్ర‌మాదాలు చోటు చేసుకొని ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్నా ర‌ని ముఖ్య‌మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

విప‌రీత‌మైన ర‌ద్దీ ఉన్న‌ ప్ప‌టికీ రాష్ట్ర విభ‌జ‌న‌తో వాహ‌న ర‌ద్దీ త‌గ్గిం ద‌ని, త‌మ‌కు స‌రైన ఆదాయం రావ‌డం లేదంటూ కాంట్రాక్ట్ సంస్థ ఆరు వ‌రుస‌ల ప‌నులు చేప‌ ట్ట‌డం లేద‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌ మం త్రి తెలియ‌జేశారు. ఎన్‌హెచ్ఏఐ (nhai), కాంట్రాక్ట్ సంస్థ మ‌ధ్య వివా దాన్ని ప‌రిష్క‌రించి త్వ‌ర‌గా ఆరు వ‌రుస‌ లుగా ర‌హ‌దారి విస్త‌ ర‌ణ చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఐకానిక్ బ్రిడ్జి ఎలివే టెడ్ కారిడార్‌ క‌ల్వ‌ కుర్తి నుంచి కొల్లాపూర్‌, సో మ‌శిల‌, క‌రివెన, నంద్యాల (ఎన్‌హెచ్‌-167కే) మార్గాన్ని జాతీ య ర‌హ‌దారిగా ప్ర‌క‌టించి 142 కి.మీ. ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచి ప‌నులు ప్రారంభించార‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలి య‌జేశారు. మిగిలిన 32 కి.మీ.ప‌నుల‌కు, ఐకానిక్ బ్రిడ్జికి టెండ‌ ర్లు పిలిచార‌ని, ఆ ప‌నులు వెంట‌నే ప్రారంభించాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు.

ఈ ర‌హ‌దారి పూర్త‌యితే హైద‌రాబాద్ వాసుల‌కు తిరుప‌తికి 70 కిలో మీట‌ర్ల దూరం త‌గ్గుతుం ద‌ని వివ‌రించారు. క‌ల్వ‌కుర్తి, నంద్యాల ర‌హ‌ దారి (ఎన్‌హెచ్ -167కే) హైద‌రాబాద్‌, శ్రీ‌శైలం ( srishailam ) మార్గంలో ఉన్న ర‌హ‌దారిలో (ఎన్‌హెచ్ 765కే) 67 కిలోమీట‌ర్ వ‌ద్ద (క‌ల్వ‌కుర్తి) ప్రారంభ‌మ‌వుతుంద‌ని, ఎన్‌హెచ్ 167కే జాతీయ ర‌హ‌దారి ప‌నులు చేప‌ట్టినందున‌, హైద‌రాబాద్‌- క‌ల్వ‌కుర్తి వ‌ర‌కు ఉన్న (ఎన్‌హెచ్ 76 5కే) ర‌హ‌దారిని రెండు వ‌రుస‌ల నుంచి నాలు గు వ‌రుస‌లుగా విస్త‌ రించాల‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

క‌ల్వ‌కుర్తి-క‌రివెన వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారి పూర్తయ్యే లోపు హైద‌రా బాద్‌-క‌ల్వ‌కుర్తి ర‌హ‌దారిని నాలుగు వ‌రుసలుగా విస్త‌ర‌ణ‌కు అను మ‌తులు ఇవ్వాల‌ని కోరారు. హైద‌రాబాద్‌-శ్రీ‌శైలం (ఎన్‌హెచ్ 765) మార్గంలో 62 కిలోమీట‌ర్లు ఆమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వు ఫారెస్టు ప‌రిధి లో ఉంద‌న్నారు. అట‌వీ అనుమ‌తులు లేక అక్క‌డ ప‌నులు చేప‌ట్ట‌ లేద‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి తెలిపారు. ఈ మార్గంలో నిత్యం ఏడువేల‌కుపైగా వాహ‌న రాక‌పోక‌లు సాగిస్తాయ‌ని, ఈ నేపథ్యంలో ఆమ్రాబాద్ ప్రాంతంలో నాలుగు వ‌రుస‌ల ఎలివేటెడ్ కారిడార్‌ (eli vated coridor) కు అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కోరా రు.

*మంథ‌నికి జాతీయ ర‌హ‌దారి ప్ర‌క‌టించండి..* మంథ‌ని నుంచి సీనియ‌ర్ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా ర‌ని, మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌ సింహారావు, మాజీ స‌భాప‌తి శ్రీ‌పాద‌ రావు గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించార‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలియ‌ జేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారుల చిత్రంలో మంథ‌నికి చోటు ద‌క్క‌ లేద‌ని, జ‌గిత్యాల‌, పెద్ద‌ ప‌ల్లి-మంథ‌ని-కాటారం రాష్ట్ర ర‌హ‌దారిని జాvతీయ ర‌హ‌దారిగా ప్ర‌క‌ టించాల‌ని, త‌గిన నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. ఈ ర‌హ‌దారి పూర్త‌ యితే ఎన్‌హెచ్‌-565, ఎన్‌ హెచ్‌-353సీ అనుసంధాన‌మ‌వుతాయ‌ ని, తెలంగాణ‌, మ‌హా రాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్ ప్ర‌జ‌ల‌కు అనువుగా ఉంటుం ద‌ని, ద‌క్షిణ కాశీగా గుర్తింపు పొందిన కాళేశ్వ‌రం ( kaalesw ara m ) క్షేత్రానికి అనుసంధానత పెరుగుతుంద‌ని ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రికి వివ‌రించారు.

*ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రి దృ ష్టికి తీసుకెళ్లిన ఇత‌ర అంశా లు…* తెలంగాణ‌ను క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రను అనుసంధానించే హై ద‌రాబాద్‌-మ‌న్నెగూడ నాలుగు వ‌రుస‌ల జాతీయ ర‌హ‌దారిగా (ఎన్‌ హెచ్‌-163) ప్ర‌క‌టించ‌డంతో భూ సేక‌ర‌ణ పూర్తిచేశాం. టెండ‌ర్లు పిల‌ వ‌డం పూర్త‌యిన ఎన్జీటీలో కేసు వ‌ల‌న ప‌నులు ప్రారంభం కాలేదు. ఆ మార్గంలో ఉన్న మ‌ర్రి చెట్ల‌ను కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం ట్రాన్స్‌లోకేష‌న్ చేసేందుకు ఎన్‌హెచ్ఏఐ అంగీక‌రించింది. ఈ ద‌శ‌లో ఎలైన్‌మెంట్ మార్చ‌డం సాధ్యం కాదు. సంబంధిత శాఖ‌ల‌ కు త‌గిన ఆదేశాలు జారీ చేసి ఈ మార్గం ప‌నులు వెంట‌నే ప్రారంభిం చాలన్నారు.
*12 ఆర్వోబీలు, ఆర్‌యూబీల ను వెంట‌నే మంజూరు చేయాలి*
జ‌గిత్యాల‌-కాటారం (130 కి.మీ.), దిండి, న‌ల్గొండ (100 కి.మీ.), భువ‌ న‌గిరి చిట్యాల (44 కి.మీ), చౌటుప్ప‌ ల్-సంగారెడ్డి (182 కి.మీ), మ‌రిక‌ల్‌, రామ‌స‌ముద్రం (63 కి.మీ.), వ‌న‌ ప‌ర్తి, మంత్రాల‌ యం (110 కి.మీ.), మ‌న్నెగూడ‌-బీద‌ర్ (134 కి.మీ.), క‌రీంన‌గ‌ర్‌-పిట్లం (165 కి.మీ.), ఎర్ర‌ వెల్లి క్రాస్ రోడ్‌-రాయ‌చూర్ (67 కి.మీ.), కొత్త‌ప‌ల్లి-దుద్దెడ (75 కి. మీ.), సార‌పాక‌-ఏటూరు నాగారం (93 కి.మీ.), దుద్దెడ‌-రాయ‌గిరి క్రాస్ రోడ్ (63 కి.మీ.), జ‌గ్గ‌య్య‌పేట‌, కొత్త‌గూడెం (100 కి.మీ.), సిరిసిల్ల‌, కోర‌ట్ల (65 కి.మీ.), భూత్పూర్‌, సిరిగిరిపాడు (166 కి.మీ.), క‌రీం న‌గ‌ర్, రాయ‌ప‌ట్నం (60 కి. మీ.) మొత్తం 1617 కి.మీ. జాతీ య ర‌హ‌దారుల‌ను అప్‌గ్రేడ్ చేయాలని అప్పీల్ చేశారు.

CM revanth reddy RRR