Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అరవై వేల ఉద్యోగాలిచ్చాం

–తద్వారా యువత పట్ల శుద్ధిని చాటుకున్నాం
–ప్రజాప్రభుత్వం తొలి 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక ప త్రాలను అందించాo
–చట్టబద్దమైన జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా నిర్దిష్టమైన గడువులో పు ఉద్యోగాలను భర్తీ
–తెలంగాణ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 60 వేల ఉద్యోగాల నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారు. ప్రజాప్ర భుత్వం ఏర్పడిన తొలి 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించామని, ఆ తర్వా త డీఎస్సీ, గ్రూప్ 1, 2, 3, లాంటి వివిధ శాఖల్లో ఖాళీలైన మరో 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు (Notifications for Vacancies)జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నా మని సీఎం గుర్తుచేశారు. చట్టబద్ద మైన జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా నిర్దిష్టమైన గడువులోపు ఉద్యోగాల ను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువకు ల్లో విశ్వాసం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ముఖ్యమంత్రి వివరిం చారు.తెలంగాణ ఫైర్ సర్వీసెస్ – సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూ ట్‌లో (Services – Civil Defense Training Institute) ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించి వారి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం ప్రసంగించిన ముఖ్య మంత్రి, గతంలో 30 వేలు మంది నియామక పత్రాలు అందుకున్న వారిలో 483 ఫైర్‌మెన్‌లు, 155 డ్రైవర్‌ ఆపరేటర్స్‌కు (Driver Operators)కూడా ఉండ టం, వారిప్పుడు కఠిన శిక్షణ కూడా పూర్తి చేసుకోవడంపట్ల ఈ సంద ర్భంగా వారికి అభినందనలు తెలి యజేశారు.ఏ ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు తెగించి సామాజిక బా ధ్యతగా ఉద్యోగంలో చేరడానికి ముందు కొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అభినంది స్తుందని చెప్పారు.ప్రజల ఆకాంక్షల కు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడి పించాలన్నదే తమ ఆలోచనగా ము ఖ్యమంత్రి పేర్కొన్నారు.

సహేతుక మైన సమస్యలను పరిష్కరించడా నికి ప్రభుత్వం (government)ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఎవరూ నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు.ఈ కార్యక్రమంలో పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి,ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, హోంశాఖకు చెందిన ఉన్నతాధికా రులు పాల్గొన్నారు.