CM Revanth Reddy siricilla : సిరిసిల్ల గిరిజన బిడ్డకు ప్రభుత్వం సాయం
--పేద విద్యార్థిని బాదావత్ మధుల తకు ఐఐటీకి ప్రవేశానికి సహకారం --సీఎం రేవంత్ ఆదేశాలతో చెక్కు అందజేసిన అధికార యంత్రాంగం
సిరిసిల్ల గిరిజన బిడ్డకు ప్రభుత్వం సాయం
–పేద విద్యార్థిని బాదావత్ మధుల తకు ఐఐటీకి ప్రవేశానికి సహకారం
–సీఎం రేవంత్ ఆదేశాలతో చెక్కు అందజేసిన అధికార యంత్రాంగం
ప్రజా దీవెన, హైదరాబాద్: ఆపదలో ఉన్న పేదింటి విద్యార్థినికి ( poor student) అండగా నిలిచింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభు త్వం. జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీ (iit) లో సీటు సా ధించి ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్న పల్లి మండలం గోనే నాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదా వత్ మధులతకు ప్రభుత్వం తోడ్పాటును అందించింది.
ఐఐటీకి సీటు వచ్చినా ఆర్ధిక ఇబ్బందులతో వెళ్ల లేకపోతున్నట్లు మేకల కాపరిగా అనే శీర్షికతో పలు ప్రసార మాధ్య మాల్లో వచ్చిన కథనంపై స్పందిం చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM revanth reddy) ఆ పేదింటి చదువుల తల్లికి తక్షణమే సహా యం అందిం చాల్సిందిగా అధికారు లను ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ ( tribel welf are) అధికా రులు విద్యార్థిని మధు లత వివరాలు తెలుసుకొని మాట్లా డి వారి కుటుంబాన్ని బుధవారం హైదరాబాద్ కు తీసుకువచ్చారు. సచివాల యంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ ద్వారా విద్యార్థిని మధులత కు రూ. 1,5 1,831 చెక్కు ను అందజేశారు.
విద్యార్థిని కోరిక మేర కు హైఎండ్ కంప్యూటర్ ( computer) కొనుగోలు కోసం ఇప్పు డిచ్చిన రూ.70వే లకు అదనంగా మరో రూ.30వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవి ష్యత్తులోనూ అండ గా ఉంటామని అధికారులు భరోసా ఇచ్చారు.
ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక చదువు కోలేనేమో అని ఆందోళన చెందుతోన్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే మీడియా ద్వారా సమస్యను తెలుసుకొని మానవత్వం ( humanity grou nd) తో స్పందించినందుకు సంతోషంగా ఉందని విద్యార్థిని మధు లత అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని సీఎం ధన్యవాదాలు తెలి పారు. ఈ కార్యక్రమoలో ట్రీకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, గిరిజన శాఖ అధికారులు పాల్గొన్నారు.
CM Revanth Reddy siricilla