Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cm Revanth Reddy: ఇరవై యేళ్ళ తర్వాత పంతుల్ల పదోన్నతులు

–18,942 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు
–ఎస్జీటీలు, పండితులు, పీఈటీ లకు ప్రమోషన్ అవకాశం
–సీఎం రేవంత్‌ ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయుల హర్షం

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: పంతుల ప్రమోషన్లకు మోక్షం లభించింది. అప్పుడు ఇప్పుడు కాకుండా ఏకం గా 20 ఏళ్ల తర్వాత ప్రభుత్వ టీచ ర్లకు 13 అవకాశం కల్పించింది సీఎం రేవంత్ రెడ్డి(cm Revanth Reddy)ప్రభుత్వం. తెలంగాణలో భారీ సంఖ్యలో ఉపాధ్యా యులకు పదోన్నతులు దక్కాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ),భాషా పండితులు (ఎల్పీ), వ్యాయామ విద్య ఉపాధ్యాయు(పీఈటీ)లు(pet)పొందారు. రాష్ట్రం లో ఇప్పటి వరకు మొత్తం 18,942 మంది టీచర్లకు ప్రమోషన్లు దక్కిన ట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించా యి. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి (revanth Reddy) సముచిత రీతిలో వ్యవ హరించిందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అర్హులైన వేలాది మంది పదోన్నతులకు నోచు కోలేదని, తమ 20 ఏళ్ల కల నెరవే రిందని పేర్కొంటున్నారు. విద్యా శాఖ (educational department)కూడా సీఎం వద్దే ఉండడంతో పదోన్నతుల విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకా శం ఏర్పడిందంటున్నారు. చట్టపర మైన అడ్డంకులు తొలగిపోవడంతో పదోన్నతులకు మార్గం సుగమమైం దని చెబుతున్నారు. తమ అర్హతకు తగినట్లు పదోన్నతులు దక్కడంతో ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వా నికి, విద్యా శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.మల్టీ జోన్‌ 1లో ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రభు త్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 10,083 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. అలాగే మల్టీ జోన్‌ 2లో ఎస్జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా స్థానిక సంస్థల స్కూళ్లలో 5,962 మందికి, మల్టీ జోన్‌ 2 పరిధిలో ప్రభుత్వ బడుల్లో 1,027 మందికి పదోన్నతులు దక్కా యి. అలాగే మల్టీ జోన్‌ 2 పరిధిలో స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపా ధ్యాయులుగా స్థానిక సంస్థల పాఠ శాలల్లో 776 మందికి, మల్టీ జోన్‌ 1లో స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా స్థానిక సంస్థల బడుల్లో 995 మందికి, మల్టీ జోన్‌ 1లో ప్రభుత్వ స్కూళ్లలో ని 99 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి.