Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: తెలంగాణలో యువతీయువ కుల ద్యేయంగానే జాబ్ క్యాలెండర్

— తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో యువతీ యువ కులకు అండగా నిలవాలన్న లక్ష్యంతో జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతు న్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహాత్మ జ్యోతీరా వు పూలే ప్రజాభవన్‌లో జరిగిన రాజీవ్ గాంధీ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా UPSC సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్ర మార్కతో కలిసి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సింగరేణి సౌజన్యంతో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కుల పంపిణీ చేశారు.సివిల్స్ లో మన రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ మని, ప్రభుత్వం అందిస్తున్న లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కాదని, ప్రోత్సాహకంగా భావించా లని ముఖ్యమంత్రి అన్నారు.

గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే స్వతంత్ర భారత చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని వివరించారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.ఉమ్మడి ఏపీ సహా తెలంగాణ ఏర్పడిన 14 ఏళ్లుగా గ్రూప్ 1 నిర్వహించలేదని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందుకు ఉన్న అడ్డంకులు, కుట్రలను అధిగ మించి 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామన్నారు. వచ్చే మార్చి 31 లోగా గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయబోతున్నామని చెప్పారు. సాధించాలన్న పట్టుదల ఉంటేనే విజయం వరిస్తుందని, ఇంటర్వ్యూ కు వెళ్లే ప్రతి ఒక్కరూ సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. రేపటి భవిష్యత్తు లో మీరు భాగస్వామ్యం కావాలని, అత్యధికంగా సివిల్ సర్వీసెస్ సాధించి తెలంగాణ ముందు భాగంలో నిలపాలని ఆకాంక్షించారు.

సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని, సివిల్స్ సర్వీసెస్‌లో దేశంలోనే అత్యధికంగా ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి తెలంగాణ చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇదే వేదికగా సింగరేణి సిబ్బందికి ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రతి కార్మికుడికి 1.25 కోట్ల ప్రమాద బీమా భద్రత కల్పించడానికి సంబంధించి సింగరేణి సంస్థకు బ్యాంక్ ఆఫ్ బరోడాకు మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి సమయంలో సింగరేణి చైర్మన్, సీఎండీ బలరాం నాయక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.