–ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ఆవి ష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంతోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞా నంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదా రుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమా ర్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యం ఎంత గొప్పదైనప్పటికీ అమలులో లోపాలుంటే ప్రభుత్వంపై విశ్వ సనీయత దెబ్బతింటుంది. పేద వారికి అన్యాయం జరుగు తుంది. అందుకే సాంకేతిక నైపు ణ్యాన్ని జోడించి ఏ ఒక్క ఇళ్లు కూడా అనర్హులకు చెందకూడదని ప్రత్యేకంగా యాప్ అందుబాటు లోకి తెచ్చామని ఈ సందర్భంగా వివరించారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తాం. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కింద ఇండ్ల కేటా యిం పు జరుగుతుంది. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీ లు, వ్యవసాయ కూలీలు, పారి శుద్ధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్ ఈ క్రమంలో ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లను కేటాయిస్తాం. ఉన్న స్థలాన్ని గరిష్టస్థాయిలో వినియోగించుకుని నిర్మించుకునేలా లబ్దిదారుల కోసం ప్రతి మండల కేంద్రంలో ఒక నమూ నా ఇంటిని నిర్మించి చూపిస్తాం. అచ్చం అలాగే కట్టాలని కాకుండా అవగాహన కోసం మాడల్ హౌజ్ ను చూపిస్తాం.
తొలి సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల కేటాయింపులో భాగంగా మొత్తంగా 4.50 లక్షల ఇండ్లకు ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిధులకు పరిపాలనా అనుమతులు ఇచ్చాం.ఆది వాసీలు, ఆదివాసీ తండాలు (ఐటీడీఏ తండాలకు) జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను నిర్మిస్తాం. ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామన్నారు. గతంలో రుణాలు తీసుకుని ఇండ్లు కట్టుకున్న 7 వేల కుటుంబాల రుణాలను కూడా ప్రభుత్వం తీర్చి వారిని రుణ విముక్తులను చేస్తుంది. పెరిగిన ధరలు, పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి ఇండ్లు కట్టుకోవడానికి అండగా నిలవాలని ఈ పథకం తీసుకొచ్చింది. పెరిగిన ధరలు, పేదల అవసరాలను దృష్టి లో పెట్టుకుని ప్రతి పేద వాడికి 5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తుంది.
2004 నుంచి 2014 వరకు 25.04 లక్షల పేదల కు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరిగింది. 2014 – 2023 కాలంలో 1. 52 లక్షలు డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణం చేపడితే వాటిల్లో 60 నుంచి 65 వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేయగా, అర్థాంతరంగా వది లేసిన ఇండ్లను పూర్తి చేయడానికి ప్రజా ప్రభుత్వం 195 కోట్లను కేటాయించింది. పేదలకు వెసులు బాటు కల్పిస్తూ విధివిధానాలను నిర్ణయించాం. అదనంగా ఒక గది కట్టుకుంటామంటే అందుకు వెసు లుబాటు కల్పించాం.
ఇదొక పండు గ సందర్భం. ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుం ది. ఆత్మగౌరవంతో బతకాలన్నది ప్రతి ఒక్కరి కల. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటిముందు వెలు గుల్లో పండుగ చేసుకునే సంద ర్భమిది. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఇతర అధికారులు పాల్గొన్నారు.