CM revanth reddy Ttd yadhadri : తిరుపతి తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు
--యాదగిరిగుట్ట దేవాలయ సమ స్యలకు సత్వర పరిష్కారం --గుడి ప్రాశస్త్యం దెబ్బతినకుండా సాంప్రదాయం పనులన్నీ చేపట్టాలి --నవంబర్ 15 న యాదగిరిగుట్ట స మగ్ర ప్రణాళిక తో మరో సమావేశం -- అధికారులతో రాష్ట్ర ముఖ్యమం త్రి ఏనుముల రేవంత్ రెడ్డి
తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు
–యాదగిరిగుట్ట దేవాలయ సమ స్యలకు సత్వర పరిష్కారం
–గుడి ప్రాశస్త్యం దెబ్బతినకుండా సాంప్రదాయం పనులన్నీ చేపట్టాలి
–నవంబర్ 15 న యాదగిరిగుట్ట స మగ్ర ప్రణాళిక తో మరో సమావేశం
— అధికారులతో రాష్ట్ర ముఖ్యమం త్రి ఏనుముల రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి:తిరుమల తిరుపతి దేవస్థానం ( ttd ) మాదిరిగానే యాదగిరిగుట్ట దేవాలయానికి బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ( cm revanth reddy) అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్య మంత్రి తన జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట( yadagirigutta ) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శిం చుకొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆలయఅర్చకులు, పూజారులు, వేద పండితులు రాష్ట్ర ముఖ్యమంత్రి కి పూర్ణ కుం భంతో స్వాగతం పలికి ప్రత్యేక పూ జలు నిర్వహించారు.
అనంతరం ముఖ్యమంత్రి యాదగిరిగుట్ట పైనే ఉన్న ప్రసిడెన్షియల్ సూట్ లో యా దగిరిగుట్ట దేవాలయ అభివృద్ధిపై యదగిరి గుట్ట టెంపుల్ డెవల ప్ మెంట్ అథారిటీ అధికారులు, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వ రరావు ( thummaala nagesw arrao) ఉత్తంకుమార్ రెడ్డి ( utta m kumar reddy) కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( komatireddy venkatreddy), పొన్నం ప్రభా కర్ ( ponnam Prabhakar) ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాం తకుమారి, ఆర్ అండ్ బి, దేవా దాయ, ఇంజనీ రింగ్, తదితర శాఖల రాష్ట్ర సీని యర్ అధికారులు, జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో సమీక్షించారు.
ముందుగా రాష్ట్ర ముఖ్య మంత్రి దేవాలయానికి సంబంధించి చేప ట్టిన పనులు, ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు, చెల్లింపులు తది తర అన్ని అంశాలను అడిగి తెలుసు కున్నారు. కాగా యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీ ( Temple Develop ment Au thority) వైస్ చైర్మన్ కిషన్ రావు యాదగిరి గుట్ట దేవాలయ అభి వృద్ధికి చేసిన పనులు, పెండింగ్ లో ఉన్న పనులు,ఖర్చు,భవిష్యత్ ప్రణాళిక (Future plan) తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా వివరించారు.
అనం తరం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లా డుతూ యాదగిరిగుట్ట దేవాలయ చైర్మన్ (Yadagirigutta Temple Chairman) పదవికి గౌరవాన్ని పెంచే విధంగా ప్రాధాన్యతనివ్వా లని, యాదగిరి గుట్టకు తిరుపతి లాగే ఒక బోర్డును ఏర్పాటు చేయా లని, గోశాలను బెస్ట్ మోడల్ గోశా లగా అభివృద్ధి చేయాలని, భక్తులు గోవులను, గోశాల అభివృద్ధిని దత్త త తీసుకునే విధంగా ప్రత్యేకించి ఒక యాప్ ఏర్పాటు చేయాలని సూచించారు.
యాదగిరిగుట్టకు సంబంధించిన టెంపుల్ కమిటీ, ఇతర కమిటీలను పునర్నిర్మించాలని, గోసంరక్షణకు ఒక పా లసీని (A policy for cow protection) ప్రత్యేకంగా రూపొం దించాలని, యాదగిరిగు ట్టలో ఒక రోజు నిద్ర చేయడం భక్తులకు ఆన వాయితిగా వస్తున్న ఆచారమని, దానికి ప్రాధాన్యతనిస్తూ ప్రణాళిక రూపొందించాలని, కేశఖండన, నిద్రచేసేందుకు దేవాలయ ఆగమ శాస్త్ర ప్రకారం భక్తుల మనోభా వాలు దెబ్బతినకుండా వీటన్నిటిపై స మగ్ర నివేదిక తయా రు చేయాలని (Prepare a comprehe nsive report) ఆదేశించారు.
నిధుల కోసం చిన్న చిన్న పనులు పెండింగ్ లో ఉంచకుండా, నూరు శాతం పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించి నవంబర్ 15 లోగా దేవాలయానికి సంబం ధించిన అన్ని అంశాలతో సమీక్షకురా వాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయం పై ప్రధాన కార్య దర్శి( chief secretary) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పా రు. ఆర్ అండ్ బి ,దేవాదా య, తదితర ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ లు ( en c ) వెంటనే దేవాలయాన్ని ప్రత్యక్షం గా తనిఖీ చేసి నివేదిక సమర్పిం చాలని, తాను మరోసారి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేస్తాన ని, దేవాలయ అన్ని పనులకు సంబం ధించి ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే పూరించాలని, గుడి ,గుడి చుట్టూ ఉండే అన్ని అంశా లపై రాజీ పడేది లేదని అన్నారు.
దేవా లయ భూసేకరణకు సం బంధించి అన్ని కేసులు క్లియర్ చేయా లని, అలాగే చెల్లింపులు సైతం చేయాల ని, తదుపరి సివిల్ పనుల ను ప్రాధా న్యత క్రమంలో చేపట్టాలని, సాంప్రదాయానికి సంబంధిం చిన పనులకు ప్రాధాన్యత (Prefere nce for traditional works) ఇవ్వాలని ఆదేశించారు.కాగా యా దాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కళాశాలకు ( To Bhuvanagiri District Medical College) మరికొంత స్థలం కావాలని, ప్ర భుత్వ విప్, శాసనసభ్యు లు బీర్ల ఐలయ్య రాష్ట్ర ముఖ్య మంత్రి దృష్టికి తీసుకురాగా, మెడి కల్ కాలేజీని దేవాలయ పరిధిలో వచ్చే విధంగా ప్రణాళిక రూపొందిం చాల ని, దీనిపై అధ్యయనం చేసి ఒక ని వేదిక ఇవ్వాలని ముఖ్య మంత్రి ఆ దేశించారు.
ఇకపై అన్ని అంశాలలో యాదాద్రి స్థానంలో యాద గిరిగుట్ట అని కనిపించాలని, ఆన్లై న్, ఉత్తర ప్రత్యుత్తరాలు, దేవాలయానికి సం బంధించిన టికెట్లు అన్నింటిపై యాదగిరిగుట్ట అనే పదాన్ని వాడా లని ఆయన ఆదే శించారు. కాలేజీ లో నిర్మాణానికి దాతల సహ కారం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూ చించారు. ఈ సమీక్ష సమా వేశంలో విమాన గోపురానికి బంగారు తా పడం (A golden to uch to the vimana gopura) వేద పాఠశాల నిర్మాణం వం టి అంశాలపై ప్రిన్సి పల్ సెక్రటరీ శైలజారా మయ్యర్ పవర్ పా యిం ట్ ప్రజం టేషన్ ద్వారా వివరించారు.
ఈ సమీక్ష లో షాపింగ్ కాంప్లెక్స్, వసతి గృహాల నిర్మాణం, కళ్యా ణ కట్ట పుష్కరిణి, వసతి గృహాలు, అన్నప్రసాదం కాం ప్లెక్స్, బస్టాండ్ , ప్రేసి డెన్షియల్ విల్లాస్, వసతి తది తర అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ,రాష్ట్ర వ్యవసా య శాఖ, భువనగిరి జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి,రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి,కుంభం పాటి అనిల్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీలు దాన కిషోర్, శైలజ రామయ్యర్, శ్రీనివాసరాజు, భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాస్కరరావు, తదితరులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
CM revanth reddy Ttd yadhadri