–యూత్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి గా జక్కిడి శివచరణ్ బాధ్యతల స్వీకారంలో సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అగ్ర రాజకీయ నేత లంతా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని తెలంగాణ ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్ర దేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం యూత్ కాంగ్రెస్ నుంచి వ చ్చిన వారేనని రేవంత్ రెడ్డి చెప్పా రు. హనుమంతరావు యూత్ కాం గ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చం ద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్ లో పని చేశారని ముఖ్యమంత్రి రే వంత్ గుర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క కూడా అక్కడి నుంచే వచ్చారని పేర్కొన్నారు. రాజకీయా లకు యూత్ కాంగ్రెస్ అనేది మొద టిమెట్టని వ్యాఖ్యానించారు. శుక్ర వారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో తెలంగాణ యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ సీ ఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బా ధ్యతలు స్వీకరించారు.
ఈ సంద ర్భంగా ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే పదవులు వచ్చినా, రాకపోయినా కాంగ్రెస్ శ్రేణులు మా త్రం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలి. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. పేదల ఆత్మగౌరవం కోసం ఇళ్లు కట్టిస్తు న్నాం. డబుల్ బెడ్‌రూమ్ పేరుతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేశారు. ఆయన మోసం చేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చా రు. స్థానిక సంస్థల్లో యూత్ కాం గ్రెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉం టుంది. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇస్తాం. ఫ్లెక్సీలు కట్టి దండాలు పెట్టేవారికి పదవులు రావు. ఢిల్లీ నుంచి కాదు.. గల్లీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తాం. దేశంలోనే ఎవరూ చేయ నంత రుణమాఫీ తెలంగాణ రై తాంగానికి చేశాం.భూమి లేని వా రికీ రూ.12 వేలు ఇస్తున్నాం. 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసి చూపిం చాం. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను యూత్ కాం గ్రెస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎన్నికల్లో డబ్బుతో ఎవరూ గెలవ లేరు.
మేము ప్రజాభిమానంతో గెలిచాం. డబ్బులే గెలిపిస్తాయంటే కేసీఆర్‌కు 100 సీట్లు వచ్చి ఉండే వి. కొడితే గట్టిగా కొడతామని కేసీ ఆర్ అంటున్నారు. కేసీఆర్‌ను కొ ట్టాలంటే కేటీఆర్, కవిత, హరీశ్‌నే కొట్టాలి. కేసీఆర్‌ను కేటీఆర్ ఓడిం చారు, కేజ్రీవాల్‌ను కవిత ఓడించిం ది. కల్వకుంట్ల కుటుంబం అవినీతి చూసే ప్రజలు బుద్ధి చెప్పారు. దేశం లో కులగణన చేసిన ఏకైక ప్రభు త్వం మాది.కులగణన, ఎస్సీ వర్గీ కరణపై పక్కాగా చేసిన మా లెక్క ను తప్పంటారా. కేసీఆర్ ఒక్క రోజే సర్వే చేసి కాకిలెక్కలు చూపించా రు. చెట్ల మీద విస్తరాకులు కుట్టిన ట్టుగా గతంలో సర్వే చేశారు. తెలం గాణలో జీవించే హక్కు కేసీఆర్‌కు లేదు. గ్యాంబ్లర్స్ అంతా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కులాల లెక్కలు ఎప్పటికీ తేలకూడదనే ఆ పార్టీ నేతలు పన్నాగం పన్నుతున్నారు. కేసీఆర్ లాంటి వాళ్లు తెలిసి, బలిసి సర్వేలో పాల్గొనలేదు. జనాభా లేక పోయినా రావులంతా పదవులు పంచుకున్నారు. బీసీలు ఆ లెక్కలు అడుగుతారనే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగ ణన నా కోసం కాదు, క్రమశిక్షణ కలిగిన సీఎంగా కులగణన చేయి చాం. దొంగ లెక్కలు చెప్పాలనుకుం టే మా కులాన్ని ఎక్కువ చూపించే వాళ్లం. బీసీ కులగణనకు రెండో విడత కూడా అవకాశం ఇచ్చాం. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదు.. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2002 వరకు మోదీది ఉన్నత వర్గమే. ఆయన గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో కలిపారు. అన్నీ తెలుసుకునే మోదీ కులం గురించి మాట్లాడుతున్నా. కులగణన సర్వే లో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును సామాజిక బహిష్క రణ చేయాలని తీర్మానం చేశాం. లెక్కల్లో పాల్గొనాలని కేసీఆర్, కేటీ ఆర్ ఇళ్ల ముందు డప్పు కొట్టండని అన్నారు.