Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Industrial Growth : సీఎం రేవంత్ కీలక ప్రకటన, పారిశ్రా మిక రంగాభివృద్దికి పరిశ్రమలకు స కల ప్రోత్సాహకాలు

Telangana Industrial Growth : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో పారిశ్రామిక రంగం అభివృద్ది చెందడానికి ఆయా పరిశ్రమలకు అ వసరమైన సకల ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడు లకు రక్షణ కల్పించడమే కాకుండా లాభదాయకంగా ఉండేందుకు ప్ర భుత్వం సహకారం అందిస్తుందని పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి అ న్నారు. మహేశ్వరం జనరల్ పార్క్‌ లో మలబార్ గ్రూపు స్థాపించిన జె మ్స్ అండ్ జ్యువెల్లరీ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పారిశ్రా మిక రంగం అభివృద్ధికి అన్ని రకా లుగా సహకరిస్తామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.

తెలంగాణను అభివృద్ధి పథంలో న డిపించడం, రంగాల వారిగా పరిశ్ర మలు రాణించడానికి సహకరించ డంలో ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం గా ఉంటుందని స్పష్టం చేశారు. పా రిశ్రామిక రంగం అభివృద్ధికి తెలంగా ణలో గత ప్రభుత్వాల నుంచే సాను కూల విధానాలు అమలులో ఉన్నా యని, వాటిని మరింత మెరుగైన వి ధానంలో తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ ను ఒక వ్యాపార నగరంగా తీర్చిది ద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నా ము . మహేశ్వరం ప్రాంతంలో నాలు గో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి అందించబోతున్నాం. 30 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అధునాతన నగరాన్ని నిర్మించబో తున్నాం.

ప్రపంచ దేశాలతో పోటీ పడే నైపు ణ్యం ఇక్కడి యువతలో ఉంది. హై దరాబాద్ ప్రపంచంతో పోటీ పడగ లదు. అందుకే ముంబయ్, బెంగు ళూరు చెన్నై వంటి నగరాలతో కా కుండా ప్రపంచ అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడాలని లక్ష్యంగా నిర్దేశిం చాం.

రాబోవు వందేళ్ల వరకు రాష్ట్రానికి ఏమవసరమో భవిష్యత్ ప్రణాళి కలతో రూపొందిస్తున్న తెంగాణ రైజింగ్ 2047 (Telangana Risi ng 2047) విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే డిసెంబర్ 9 న ఆవిష్కరిస్తాం. అధు నాతన భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మా ణానికి సంబంధించిన ప్రణా ళికలపై సింగపూర్, ఇతర దేశాల కన్సల్టెం ట్లు నిరంతరం పని చేస్తు న్నారు.

ఐటీ, ఫార్మా రంగాల్లో తెలంగాణ దేశంలోనే లెజెండ్‌గా నిలిచింది. దే శంలో 35 శాతం బల్క్ డ్రగ్ హైద రాబాద్ నుంచే ఉత్పత్తి అవుతోంది. ఇలాంటి ప్రాంతం నుంచి మలబార్ బంగారం యూనిట్ ప్రారంభించడం తో ఇక బంగారంలోనూ తెలంగాణ ప్రసిద్ధి చెందుతుంది.

బంగారం వ్యాపారం మంచి పేరు న్న మలబార్ గోల్డ్ తన యూనిట్‌ ను తెలంగాణలో ప్రారంభించడం సంతోషకర పరిణామం. సరైన ప్రాం తంలో, సరైన రాష్ట్రంలో మలబార్ గోల్డ్ తన యూనిట్‌ను ప్రారంభిం చిందని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ యూనిట్ ప్రారంభ కార్యక్ర మం లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీసీ సీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మ హేశ్ కుమార్ గౌడ్, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్, వైస్ చైర్మ న్ అబ్దుల్ సలాంతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.