— రెవెన్యూ మంత్రి పొంగులేటిపై అసంతృప్తి అంటూ వైరల్
–కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సీఎం రేవంత్ భేటీ
CM Revanth : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ అధికార పార్టీ లో అక స్మాత్తు గా అలజడి ఆరంభమైంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రి మం డలి బృందంతో అత్యవసర సమా వేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమా చారం. ఎమ్మెల్యేల ప్రత్యేక సమావే శానికి కారణభూతంగా భావిస్తోన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి ఈ క్రమంలో పాలేరు పర్యటనను రద్దు చేసుకొని మరీ సీఎం సమావేశానికి హాజరు కాను న్ననట్లు తెలుస్తోంది. అధికారులు ఎవరూ సమావేశానికి రావద్దని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసి నట్లు చెబుతున్నారు.
స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల ముం దు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ తాయని అధిష్టానం ఆందోళన చెందుతోందన్న సమాచారం అందు తోంది. ఎవరైతే ప్రత్యేకంగా సమా వేశం అయ్యారో వారంతా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫాంహౌజ్‌లో భేటీ అయ్యారని తెగ వైరల్ అవుతోంది. ప్రత్యేకంగా బీటీ అయిన వారిలో
నాయిని రాజేందర్ రెడ్డి, భూపతి రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మురళీ నాయక్, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
సంజీవ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, లక్ష్మీ కాంత్, దొంతి మాధవ్, బీర్ల ఐల య్య తదితర ఎమ్మెల్యేలు ఉన్నారు.