CM Revanth:ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై (SC and ST classification)సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీ కర ణకు (SC and ST classification) మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్‌ను (Bhattiwickramarka, Damodara Rajanarsimha Advocate General)సుప్రీంకోర్టుకు పంపిం చారన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు లో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలిం చిందన్నారు. వర్గీకరణపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుం దని తెలిపారు. ఇప్పుడు అమలు లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్‌లో కూడా మాదిగ, మాల ఉప కులా లకు రెజర్వేషన్లు అమలు చేసేం దుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకో స్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) అసెంబ్లీలో ప్రకటించారు.