Cm revanthreddy : లగచర్లలో ఫార్మాసిటీ పెట్టబోమని సీఎం స్పష్ఠీకరణ
--సీపీఐ కూనంనేని సాంబశివరావు వెల్లడి
లగచర్లలో ఫార్మాసిటీ పెట్టబోమని సీఎం స్పష్ఠీకరణ
–సీపీఐ కూనంనేని సాంబశివరావు వెల్లడి
ప్రజా దీవెన, హైదరాబాద్: లగచర్ల ఘటనపై విచారణ చేపట్టి అ మాయకులైన గిరిజనులపై మోపబడిన కేసులు ఎత్తివేయాలని ము ఖ్యమంత్రిని కోరినట్లు సిపిఐ రాష్ట్ర కా ర్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. సచివాలయంలో సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి త మ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్య పద్మ తదితరు లతో లగ చర్ల ఘటనపై ముఖ్య మంత్రిని కలిసారు.
ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ లగచర్లలలో జరిగిన ఘటనను ప్రభు త్వం విచారణ చేపట్టవచ్చని, కానీ గిరిజనులపై ఎ లాంటి కేసులు లేకుండా విడుదల చేయాలని కోరినట్లు, దానికి ము ఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కూడా అంగీకరించినట్లు సాంబశి వరావు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేస్తున్నది ఫార్మాసిటీ కాదని, అక్కడ ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొ న్నారని, ఆ విషయాన్ని మీరు కూడా ప్రజల్లోకి చెప్పాలని ఆయన కోరారని అన్నారు.
విషపదార్ధాలు వెదలజల్లే ఫార్మాకంపెనీలను జనావాసాల మధ్య నెలకొల్పవద్దని, అవసరమైతే ఏడారి ప్రాంతాలలో ప్రజలకు నష్టం జరగని స్థలాలలో ఏర్పాటు చేసుకోవలని వామపక్షపార్టీలు ముఖ్య మంత్రికి సూచించినట్లు వివరించారు. ఒకవేల ప్రభుత్వం జనావా సాలలో ఫార్మాకంపెనీలను ఏర్పాటు చేస్తే వామపక్ష పార్టీలుగా మే ము అంగీకరించబోమని చెప్పామని తెలిపారు. ఏదైన పరిశ్రమలు ప్రభుత్వ మిగులు భూములలో ఏర్పాటు చేసుకోవాలని గత్యంతరం లేని పరిస్థితులలో మాత్రమే రైతులను స్వచ్చందంగా ఒప్పించి రైతు లకు పూర్తి నష్టపరిహారం అందించిన తరువాతే వారి భూములలో పెట్టుకోవాలని సాంబశివరావు తెలిపారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులు ఇప్పటి వరకు సెటిల్ కాలేదని ప్రభు త్వం నుండి వచ్చిన ఆరు లక్షల రూపాయల పరిహారం అయిపోయా యి కాని కొత్తగా భూములు కొనుగోలు చేయలేకపోయారని అన్నా రు. ఈ సందర్భంగానైనా నిర్వాసితుల పాలసీని మార్చాల్సిన బాధ్య త ప్రభుత్వ మీద ఉన్నదని వారన్నారు. వారిని సంతోష పరిచేవిధం గా పరిహారం పెంచి ఇవ్వాలని, భూమికి బదులు అదే భూమి వేరే చోట అయినా ఇప్పిస్తేనే రైతులు ఒప్పుకుంటారని అన్నారు.
పేద ప్రజలకు, రైతులకు, భూ నిర్వాసితులకు ఇబ్బందులు వచ్చిన ప్పుడు, పోలీసులు అత్యుత్సాహం చూపినప్పుడు కమ్యూనిస్టు పార్టీ లు స్పందిస్తాయని సాంబశివరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం.ఎల్) మాస్‌లైన్ నాయకులు రమ, ఎస్.ఎల్. పద్మ, ఆర్. ఎస్.పి.నాయకలు జానకిరాములు, ఎంసిపిఐ నాయకులు గాదగోని రవి తదితరులు కలిసినారు.
Cm revanthreddy