న్యూయార్క్ తరహాలో విశ్వనగరంగా భాగ్యనగరం
–సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ఢిల్లీ సహా పలు నగరాలు కాలు ష్య కాసారంగా మారాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా రు. మరో పదేళ్లు విస్మరించామంటే హైదరాబాద్ కుడా అలాగే అవు తుందని చెప్పారు. వాన పడితే రోడ్లన్నీ వరదమయం అవుతు న్నాయని చెప్పారు. రోడ్ల పక్కన వాట ర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేస్తు న్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో వర్షానికి ట్రాఫిక్ నరకం లేకుం డా ప్రణాళికలు చేస్తున్నట్లు వివరిం చారు. చెరువులు, నాలాలు, కుం టల ఆక్రమణదారులకు హైడ్రాతో భయం పట్టుకుందని అన్నారు.
మెట్రోకు రూ.35 వేల కోట్లు అవసరం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.ఎన్ని ని ధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలి.
రీజనల్ రింగ్ రోడ్డుకు రూ.35 వేల కోట్లు కావాలని చెప్పారు. మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డుకు ఎన్ని నిధులు తెస్తారో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చె ప్పాలని ప్రశ్నించారు. మూసీ ప్రక్షా ళనకు బీజేపీ దగ్గర ఉన్న ప్రణా ళి కలు ఏంటో చెప్పాలని నిలదీశారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుం చి ఎన్ని నిధులు తెస్తారో కిషన్‌రెడ్డి చెప్పాలని అడిగారు. తాగునీటి ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు కావాలి, ఎన్ని తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
మూసీలో నిద్రపోతారో మోదీని తీసుకువస్తారో వాళ్ల ఇష్టం అని చెప్పారు. తెలంగాణకు మాత్రం కిషన్‌రెడ్డి నిధులు సాధిం చాలని అన్నారు. తమకు పేరు వస్తుందని కొందరు ఏడుస్తున్నారని మండి పడ్డారు. ఏడ్చే వాళ్ల గురించి తమకు బాధలేదని చెప్పారు. హైద రాబాద్ మునిగిపోతే మోదీ ఒక్క పేసా కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో రైజింగ్ పేరుతో మంగళవారం “ప్రజాపాలన-ప్రజా విజయోత్స వాలు’ నిర్వహించారు. హైదరాబా ద్లో పలు అభివృద్ధి పనుల ప్రారం భ కార్యక్రమాలు జరిగాయి.ఈ కార్యక్రమాల్లో తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలో పలు సుందరీకరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.3,500 కోట్లతో రహదారి అభివృద్ధి పను లకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16.50 కోట్లతో నిర్మించిన భూ గర్భ సంపుల ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో రూ.1 50 కోట్లతో పలు సుందరీకరణ పనులు చేపట్టారు.
సీఎం చేతుల మీదుగా దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ ప్రారంభించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టబోయే 6 జంక్షన్ల అభివృద్ధికి సీఎం శంకు స్థాపన చేశారు. 7 ఫ్లైఓవర్లు, అండ ర్ పాసులకు సీఎం చేతుల మీదు గా శంకుస్థాపన చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కిట్లను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు.
ప్రపంచంతో మన హైదరాబాద్ పోటీ…గతేడాది డిసెంబర్ 3నే ప్రజా పాలనకు ప్రజలు తీర్పు ఇచ్చా రని అన్నారు. ప్రపంచంతో హైదరా బాద్ పోటీ పడుతుందని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘా టించారు. న్యూయార్క్, టోక్యోతో సమానంగా నగరాన్ని నడిపిస్తామ ని తెలిపారు. హైదరాబాద్‌లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తు న్నామన్నారు. రూ.7వేల కోట్లతో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్ల తెలిపారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభి వృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ప్రపంచ వ్యాప్త సాంకేతిక అభివృద్ధిలో హైదరాబాదీల పాత్ర ఉందన్నా రు. ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్మా కంపెనీలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చా యని వివరించారు. నగరంలో తాగునీటి సమస్యను తీర్చింది కాంగ్రె స్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఎన్టీఆర్, కోట్ల విజ య్భాస్కర్రెడ్డి నిర్ణయాలతోనే నగరాభివృద్ధి చెందిందని అన్నారు. వైఎస్ హయాం లోనే హైదరాబాద్ కు మెట్రో ప్రతిపాదన వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడిం చారు. అదేవిధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఐటీ, రియల్ కంపెనీలు వచ్చాయన్నారు.
ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. రూ.38 వేల కోట్లతో నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు మణి హారమని అన్నారు. ఢిల్లీ సహా పలు నగరాలు కాలుష్య కాసారంగా మారాయని చెప్పారు. మరో పదేళ్లు విస్మరిం చామంటే హైదరాబాద్ కుడా అలా గే అవుతుందన్నారు. వాన పడితే రోడ్లన్నీ వరదమయం అవుతు న్నా యన్నారు. రూ.లక్షన్నర కోట్లు ఖర్చుపెడితే హైదరాబాద్ అద్భుత నగరం అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రోడ్ల పక్కన వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబో యే రోజుల్లో వర్షానికి ట్రాఫిక్ నరకం లేకుండా ప్రణాళికలు చేస్తున్నా మని చెప్పా రు. చెరువులు, నాలాలు, కుంటల ఆక్రమణదారులకు హైడ్రాతో భయ పడుతున్నారన్నారు.
అభివృద్ధి చేస్తే కాంగ్రెస్‌కు పేరు వస్తుందని బీఆర్ఎస్ ఏడుస్తుందని విమ ర్శించారు. మూసీ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నాయో బీజేపీ, బీఆర్ఎస్ చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ, హైదరాబాద్ కు కిషన్‌రెడ్డి ఏమి తెచ్చారని నిలదీశా రు. గుజరాత్‌కు మోదీ నిధు లు తీసుకెళ్తుంటే కిషన్‌రెడ్డి గుడ్లప్ప గించి చూస్తున్నారని ధ్వజమెత్తా రు. మూసీ పునరుజ్జీవనాన్ని కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజ మెత్తారు.
హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం.. చిత్తుశుద్ధి ఉంటే మూసీ అభివృద్ధికి కిషన్‌రెడ్డి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిధులు తెస్తారో గుజరాత్‌కు వలస వెళ్తారో కిషన్‌రెడ్డి చెప్పా లని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి నిలదీశారు. మెట్రోకు రూ.3 5 వేల కోట్లు అవసరం అవుతాయ న్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు రూ.35 వేల కోట్లు కావాలని తెలి పారు. తాగునీటి ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్లు కావాలి ఎన్ని తెస్తారో చెప్పాలన్నారు. మూసీలో నిద్రపోతారో మోదీని తీసుకు వస్తా రో వాళ్ల ఇష్టమన్నారు. తెలంగాణ కు మాత్రం నిధులు సాధించాలన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రె డ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం నేతృ త్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని అన్నారు. మం త్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారని వివరించారు. రాష్ట్రాభివృద్ధిపై ఉపసంఘానికి బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మేధావులు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం ఏం చేసినా అడ్డుకుంటాం అంటే ఓప్పు కోమని హెచ్చరిం చారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు.ప్రపంచ వ్యాప్త సాంకేతిక అభివృద్ధిలో హైదరాబా దీల పాత్ర ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్మా కంపెనీలు కాంగ్రెస్ హయాం లోనే వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
Cm revanthreddy