భవిష్యత్ తరాలకు సంపూర్ణ సమాచారం అందించాలి
— సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవా లను రాయకపోతే అసలైన పోరాట యోధులు, ఉద్యమాల్లో అసు వులు బాసిన అమరుల గురిం చి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందువల్ల వాస్తవాలను సమాజం ముందు ఆవిష్క రించాలంటే కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, తమ గళాలను విప్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఎన్టీ ఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఏర్పాటు చేసిన 37 వ పుస్తక ప్రదర్శనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తర్వాత బోయి విజయ భారతి వేదికగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసం గించారు.
చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్లు రాసుకునేదే చరిత్రగా ఆవిష్కృత మవుతోందని, పోరాటాల్లో అసులు బాసిన వాళ్లు, అమ రులైన వారి గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యం గురికావడం, కొంత సమాచార లో పం ఉంటుందన్నారు. సాయుధ రైతాంగ పోరాటం, తొలి దశ తెలం గాణ ఉద్యమైనా, మలిదశ తెలంగాణ ఉద్యమమైనా ఉద్యమాల్లో సమిధలైన, అమరులైన వారికంటే, రాజకీయంగా ప్రయోజనం పొం దిన వారి గురించే ఎక్కువ చర్చ జరుగుతుందని, గత పదేళ్లుగా మన కళ్ల ముందున్న చరిత్రలో వాస్తవాలు, అవాస్తవాలు గమనించి కవులు, కళాకారులు తమ కలాలను పదు ను పెట్టాలన్నారు.
సమాజం అధునాతన యుగం వైపు, సాంకేతిక పరిజ్ఞానం వైపు వెళు తున్న సంద ర్భంలో డిజిటల్, సోషల్ మీడియాల వంటి మాధ్య మా ల వల్ల ఏది వాస్తవమో, ఏది ఆవాస్తవమో గ్రహించే పరిస్థి తులు లే కుండా పోతున్నాయన్నార. యువతను పుస్తక పఠనంవైపు మళ్లిస్తే వాస్తవా లు తెలుసుకునే వీలుంటుందని, 1985 లో సిటీ సెంట్ర ల్ లైబ్రరీలో చిన్నగా ప్రారంభించిన బుక్ ఫెయిర్ ఇప్పుడు రాష్ట్ర స్థాయి లో చేపట్టడం, అందులోనూ ఎంతోమంది మేధావులు పాల్గొని వచ్చే తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుం దని చెప్పారు.
బుక్ ఫెయిర్ నిర్వహకులు ప్రస్తావించిన విషయాలపై ప్రొ. కోదండ రాం నివేదిక రూపంలో అందజేస్తే వాటిని పరిశీలించి సామాజిక బాధ్యతగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేంద ర్ రెడ్డి, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూబ్, ఎమ్మెల్సీ కోదండ రాం, జస్టిస్ సుదర్శన్ రెడ్డి , ప్రొ. రమా మెల్కోటే , సీనియర్ పాత్రికే యులు రామచంద్రమూర్తి తోపాటు ఎంతో మంది ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు హాజరయ్యారు.
Cm revanthreddy