Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cm revanthreddy : విద్యార్థుల‌ను క‌న్న బిడ్డ‌ల్లా కాపాడుకోవాలి

--పాఠ‌శాల‌లు, గురుకులాల‌ను త‌ర‌చూ త‌నిఖీ చేయాలి --విద్యార్థుల‌కు ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అంద‌జేయా లి --జిల్లాల క‌లెక్ట‌ర్లకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

విద్యార్థుల‌ను క‌న్న బిడ్డ‌ల్లా కాపాడుకోవాలి

–పాఠ‌శాల‌లు, గురుకులాల‌ను త‌ర‌చూ త‌నిఖీ చేయాలి
–విద్యార్థుల‌కు ప‌రిశుభ్ర వాతావ‌ర‌ణంలో పౌష్టికాహారం అంద‌జేయా లి
–జిల్లాల క‌లెక్ట‌ర్లకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం

ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శా ల‌లు, వ‌స‌తిగృహాలు, గురుకుల పాఠ‌శాల్ల‌లో విద్యార్థుల‌ను క‌న్న బిడ్డ‌ల్లా చూడాల‌ని, వారికి ప‌రిశు భ్ర‌మైన వాతావ‌ర‌ణంలో పౌష్టికా హారం అందించ‌డంలో ఎటువంటి అల‌క్ష్యానికి తావు ఇవ్వ‌వ‌ద్ద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు. విద్యార్థు ల‌కు అందించే ఆహారానికి సంబం ధించి చోటుచేసుకుంటున్న ఘ‌ట‌ న‌ల‌పై ముఖ్య‌మంత్రి ప‌లుమార్లు స‌మీక్షించారు.

క‌లెక్ట‌ర్లు త‌ర‌చూ పాఠశాలల‌, వ‌స‌తిగృహాలు, గురుకుల పాఠ‌శాల‌ల‌ ను త‌నిఖీ చేయాల‌ని అనంత‌రం అందుకు సంబంధించిన నివేదిక‌ ల‌ను సమ‌ర్పించాల‌ని సీఎం క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ప‌లుమార్లు ఆదే శాలు ఇచ్చినా పొర‌పాట్లు చోటు చేసుకుంటుండంపై సీఎం ఆవే ద‌న వ్య‌క్తం చేశారు. విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌ వ‌ని సీఎం హెచ్చ‌రించారు.

విద్యార్థుల‌కు ఆహారం అందించే విష‌యంలో ఎవ‌రైనా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొల‌గించేం దుకు వెనుకాడ‌మ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల‌కు మంచి వి ద్య అందించాల‌నే ఉద్దేశం తో వేల సంఖ్య‌లో ఉపాధ్యాయులనియా మ‌కాలు చేప‌ట్ట‌డంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలు పెంచిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి గు ర్తు చేశారు.

విద్యార్థుల విష‌యంలో తాము సానుకూల నిర్ణ‌యాలు తీసుకుంటు న్న‌ప్ప‌టికీ కొంద‌రు ప్ర‌భుత్వాన్ని అప్ర‌తిష్ట‌పాలు చేసేందుకు ప్ర‌య‌త్ని స్తున్నార‌ని, అటు వంటి శ‌క్తుల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తా మ‌ని, బాధ్యులైన వారిని చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షిస్తామ‌ని ముఖ్య‌మంత్రి హె చ్చ‌రించారు. వ‌స‌తిగృహాల్లో ఆహారం విష‌యంలో కొంద‌రు ఉద్దేశ‌ పూర్వ‌కంగా పు కార్లు సృష్టించ‌డంతో పాటు లేని వార్త‌లను ప్ర‌చారం చేస్తూ విద్యార్థు ల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నార‌ని, వారిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారు ల‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

Cm revanthreddy