Cm revanthreddy : విద్యార్థులకు భోజన నాణ్యతలో పారదర్శకత పాటించాలి
--విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్
విద్యార్థులకు భోజన నాణ్యతలో పారదర్శకత పాటించాలి
–విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంకటేష్
ప్రజా దీవెన, కొండమల్లేపల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రా విద్యా కమిషన్ సభ్యులు డాక్టర్ చారకొండ వెంక టేష్, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, మండల విద్యాశాఖ అధి కారి నాగేశ్వర్ రావు తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. కొండ మల్లే పల్లిలోని సోషల్ వెల్ఫేర్ రెసి డెన్షియల్ గర్ల్స్, స్కూలు, కాలేజీ లో విద్యార్థులతో కలిసి మధ్యా హ్నం భోజనం చేశారు.
సాయంత్రం నాంపల్లిలోని కీజీబీవీలో విద్యార్థు లతో కలిసి స్నాక్స్ తిన్నారు. పదా ర్థాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కొండమల్లపల్లిలోని కీజీబీవీ, గుర్రంపూడులోని మోడల్ స్కూల్, నాంపల్లిలోని కీజీబీవీలో విద్యార్థులకు రోజు వడ్డిస్తున్న భోజనం, వంట సామాగ్రి,కిచెన్ షెడ్, స్టాకు గదులు, స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన బియ్యం,గుడ్లు, కూరగాయలు, పప్పు బియ్యంలను ఇతర సరుకుల నాణ్యత ను పరిశీలించారు.
కూరగాయలు పాడైపోవడం, బియ్యం బస్తాల నిర్వహణ సరిగా లేక పోవడంతో ఎస్వో, అసిస్టెంట్ కేర్ టెకర్, మెస్ కాంట్రాక్టర్ పై ఆగ్రహo వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమై న భోజనం అందజే స్తున్నా రా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. ప్రతీ రోజు మెనూ ప్రకా రం విద్యార్థులకు భోజనం వడ్డిం చాలన్నారు. తా జా కూరగాయ లు,నాణ్యత గల సరుకులను మాత్రమే వంటకు విని యోగించాలని సూచించారు.
వంటశాల ప్రదేశం, వంట పాత్రలు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూ సుకోవాలని సూచించారు. నాసిరకమైన బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు సరఫరా చేసినట్లయితే తీసుకోవద్దనారు. ప్రతిరోజూ ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని టీచర్ల కు, మెస్ కమిటీ సభ్యులకు సూ చించారు. భోజన నాణ్యతలో నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయు లకు, వంట వారికి సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లా డి భోజనం ఎలా ఉంటోంది, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. విధులపట్ల, భోజన నిర్వాహణలో నిర్లక్ష్యమంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని హె చ్చరించారు.
Cm revanthreddy