Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cm revanthreddy : సీఎం రేవంత్ కీలక ప్రకటన.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా

సీఎం రేవంత్ కీలక ప్రకటన.. సంక్రాంతి తర్వాత రైతు భరోసా

ప్రజా దీవెన, హైదరాబాద్: పాలమూరు లో జరిగిన రైతు పండుగ లో వేలాది మంది రైతులు పాల్గొని  ఆశ్వీరాదం ఇచ్చారని, రైతుల ఆశ్వీరాదం ప్రభుత్వానికి గొప్ప శక్తి ని ఇచ్చిందని తెలంగాణ ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  568 రైతు వేదికల నుంచి  లక్షలాది మంది రైతులు రైతు పం డుగ లో పాల్గొన్నారని వెల్ల డించా రు. వాస్తవాల ప్రాతిపదికన మా ప్రభు త్వం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటోందని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన సహచర మంత్రులతో కలిసి ఏర్పా టుచే సిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

16 వేల మిగులు బడ్జె ట్ తో 69 వేల కోట్ల అప్పుల తో నాటి కేంద్రంలోని కాంగ్రెస్   తె లంగాణ ఇచ్చిందని, కేసీఆర్ నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పు తో మా ప్రభు త్వం ఏర్ప డిందని వివరించారు. ఏడు లక్షల కోట్ల అప్పు పైన  నెల కు  6500 కోట్ల మిత్తి చెల్లించే పరి స్థితి ఉందని, ఏడు లక్షల కోట్ల అప్పు ఉంద న్న సంగతి ఏ సందర్భంలో కూడా కేసీఆర్ ,హరీష్ రావు, ఈటెల రా జేందర్ ప్రజలకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.అద్భుతమైన పరిపాలనను అంది స్తున్నామని, బంగారు తెలంగాణగా మారుస్తు న్నామని అబద్దాలు చెప్పారని గుర్తు చేశారు. మా ప్రభుత్వం ఏర్ప డిన తర్వాత  డిసెంబర్ 9 న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరి స్థితిపైన శ్వేతపత్రం విడుదలచే సి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివ రించామని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. 7 లక్ష ల కోట్ల అప్పు ఉన్నప్పటికి  అధైర్య పడకుండా ఇచ్చి న గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతును రాజును చేయడమే లక్ష్యం గా మా ప్ర భుత్వం ముందుకు వెళ్తోందన్నారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర , ఉ పాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నామని 2023 వానాకాలం రైతు బంధు కేసీఆర్ ఎగ్గొట్టారని, మేం అధికారం లో రాగానే 7625 కోట్ల రూపాయలను రైతు బంధు కింద చెల్లించా మని వివరించారు.ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణ మాఫీ చేశామని, 25 రోజుల్లో  22,22,067 మంది రైతులకు  17 869 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, మహబూబ్ నగర్ లో 2747 కోట్ల రూపాయల రుణమాఫీ ని నాలుగో విడత గా చేశామని చెప్పారు.

మొత్తంగా 25, 35,964 మంది రైతులకు  20,6 16  కోట్ల రూపా యల రుణమాఫీ  చేశామని, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్ప టి వరకు 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత తక్కువ సమయంలో రూ.  20616 కోట్ల రుణ మాఫీ చేయలేదని, దేశంలో ఇది గొప్ప రికార్డు అని, బీఆర్ఎస్ హయాంలో రెండు సార్లు కూడా లక్ష రూపాయల రుణమాఫీ సరిగా చేయలేదని, ఏక మొత్తంలో లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారని,ఎన్నికల సమ యంలో అవుటర్ రింగ్  రోడ్డును అమ్మి 11 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని, నాలుగున్నర యేళ్లు రుణమాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ కింద రైతులు 8578.97  వేల కోట్ల చెల్లించాల్సి వచ్చిందని వివరించారు.

బీఆర్ఎస్ రెండో సారి  చేసిన రుణమాఫీ కేవలం  3331 కోట్ల మాత్ర మేనని, బీఆర్ఎస్ ప్రభు త్వం చేసిన రుణమాఫీ ఎలాంటిదో రైతుల కు తెలుసని, కాంగ్రెస్ రుణ మాఫీ తో రైతులు ఆనందంగా ఉన్నార న్నారు. కేసీఆర్ పెట్టిన రైతు బంధు బకాయిలను మా ప్రభుత్వం చెల్లించిందని, రైతు పక్షపాతి అని మేంనిరూపించుకున్నామని, సం క్రాంతి పండుగ తర్వాత రైతు భ రోసా వేస్తాం, ఇందిరమ్మ ప్రభుత్వం లో సోనియమ్మ గ్యారెంటీ అమలు అయి తీరుతుందని, ఎలాంటి మారిషులు వచ్చి అబద్దాలు చెప్పినా రైతులు నమ్మోద్దని కోరారు.

సంక్రాంతి తర్వాత రైతు భరోసా…సోనియా గ్యారంటీగా నేను చెపు తున్న సంక్రాంతి తర్వాత రైతు భరోసా పడుతుందని సీఎం స్పష్టం చేశారు. రైతు భరోసా విధివిధానా ల పైన  మంత్రివర్గ ఉప సంఘం వేశామని,అసెంబ్లీ సమావేశాల్లో  రైతు భరోసా  విధి విధానాల పై చర్చించి ఖరారు చేస్తామని వెల్లడించారు.  రైతు రుణమాఫీ చేస్తా మని చెప్పి చేసి చూపించామని చెప్పారు.

రైతు భరోసా కూడా ఇచ్చి తీరు తామని, మారువేషంలో వచ్చే మారి షులు బీఆర్ఎస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దని, సన్న వడ్ల కు 500 రూపాయల బోనస్ పై కొందరు అపోహలు సృష్టించారని ఆరో పించారు.వరి కొనుగోలు కేం ద్రాలను మూసి వేస్తామని, వరి వేసు కుంటే ఉరేనని కేసీఆర్ గతంలో అన్నారని,మా ప్రభుత్వం మాత్రం సన్న వడ్లు పండించండి,  బోనస్ ఇస్తామని చెపుతోందని, ఇప్పటి వరకు  31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరిం చిందని తెలిపారు.

వచ్చే సీజన్ కూడా  500 రూపాయల బోనస్ కొనసాగుతుందని, తెలంగాణ సోనా, బీపీటీ ,హెచ్ ఎం టీ లాంటి వంగడాలు వేస్తే ఎక్కు వ దిగుబడి వస్తుందని, తెలంగాణ ప్రజలు ఎక్కువగా తినే బియ్యం కూడా ఇవేనని అన్నారు. తెలంగాణ భూ ముల్లో పండే ధాన్యా న్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అను కుంటున్నామని, సంక్షే మ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతామని స్పష్టం చేశారు.

రాజకీ యాలకు అతీతంగా రైతులకు దగ్గ రగా ప్రభుత్వం నిర్ణయాలు తీసు కుంటోందని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్ర మాలను మీడి యా మరింత గా రైతులకు చేరవేయాలని అప్పిల్ చేశారు. రెండు లక్షల రూపాయల వరకు వంద శాంత రుణ మాఫీ పూర్తైందని వెల్ల డించారు.రేషన్ కార్డు లేని వారికి కూడా రుణ మాఫీ అయిందని, రుణమాఫీ కి రేషన్ కార్డు కు సంబంధం లేదన్నారు.

దీర్ఢకాలిక రుణాలను కూడా బ్యాంక్ లు పంపించాయి, అందుకే 31 వేల కోట్ల కు పెరిగిందని, తప్పు డు సమాచారం ఇస్తే శిక్షలు తప్పవని చెప్పడం తో బ్యాంకులు వివరాలు సరిచేసి ఇచ్చాయని అన్నారు. గుజరాత్ లో మధ్య నిషే ధం ఉందని బీజేపీ చెబుతోందని, కావా లం టే అక్కడ ఏ బ్రాండ్ లు దొరుకుతాయే తీసుకెళ్లి చూపిస్తామని, కిషన్ రెడ్డి కి తెలంగాణ తో  ఏం సంబంధం మాట్లాడటానికి ఆయనకుఏం అర్హత ఉందన్నారు.కేంద్రంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు, మేం ఇచ్చిన హామీలపై చర్చించడానికి మేం సిద్ధమని సవాల్ చేశారు.

ఈ మీడియా సమా వేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యన్నం శ్రీనివాసరెడ్డి, మందుల శామ్యూల్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పా ల్గొన్నారు.

Cm revanthreddy