Cm revanthreddy palamooru : ఉమ్మడి పాలమూరు అభివృద్ధికి ఊతం
--పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తాం --ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు బి. టి రోడ్లు వేసేందుకు రంగం సిద్ధం --నివేదికలు రూపొందించాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఉమ్మడి పాలమూరు అభివృద్ధికి ఊతం
–పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తాం
–ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు బి. టి రోడ్లు వేసేందుకు రంగం సిద్ధం
–నివేదికలు రూపొందించాలని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
ప్రజా దీవెన, పాలమూరు: ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని వి ధాలు గా అభివృద్ధి చేసి తీరుతానని తె లంగాణ ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్ రెడ్డి ( cm revanth red dy) హామీ ఇచ్చారు. తొలి ముఖ్య మంత్రి బూర్గుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ ( mahaboob Nagar) నుండి ప్రాతినిధ్యం వహించగా ఇన్ని సం వత్సరాల తర్వాత పాలమూరు బిడ్డ అయిన తనకు ముఖ్యమంత్రి గా పని చేసే అవకాశం వచ్చిందని అందువల్ల ఎవరు అడ్డుపడినా జిల్లాలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు ( pending proje cts) శర వేగంగా పూర్తిచేస్తామని, త్వరలోనే మక్తల్, కొడంగల్ ( kodangal ) నారాయణపేటకు కృష్ణా జలాలు పారుతాయని తెలియజేశారు.
2009 తెలంగాణ ఉద్యమ సమయంలో కే. చంద్రశేఖర రావు ( kc r) పాలమూరు నుండి పార్లమెంటు స్థానానికి పోటీ చేయగా జిల్లా ప్రజలు ఆశీర్వదించి గెలిపించారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్ప డ్డాక 10 సంవత్సరాలు ముఖ్య మంత్రిగా ఉండి పాలమూరు ( palamo or ) ) అభివృద్ధికి ఏమి చేయ లేకపోయారని గుర్తుచేశారు. అ ప్పు డు వారి సొంత జిల్లాను అభి వృద్ధి ( devalopment) చేసుకుంటే మేము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు నాకు ముఖ్య మంత్రిగా అవకాశం వచ్చి స్వంత జిల్లాను అభివృద్ధి చేసుకునే ప్రయ త్నం చేస్తే లేనిపోని ఆరోపణలు చేసి అడ్డుపడుతున్నారని ప్రతిపక్ష ( Opposition parties) పార్టీ లపై మండిపడ్డారు.
పాలమూరు జిల్లా అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే తగిన సమాధానం ఇస్తారని, తాను మాత్రం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతానని చెప్పా రు. ఆదివారం మహ బూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ని కురుమూర్తి స్వా మి దేవస్థానానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామో దర్ రాజనర్సింహ, రోడ్లు,భ వనా ల మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు జి. మధు సూదన్ రెడ్డి, మహ బూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీని వాస రెడ్డి,మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి తో కలిసి స్వామి వా రిని దర్శించుకొని ఆశీ స్సులు తీసుకున్నారు.
వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లా లోని కురు మూర్తి స్వా మి దేవాలయానికి చిన్న పిల్లలు, వృద్ధులూ, దివ్యాంగులు సైతం దైవ దర్శనం చేసుకునే వి ధంగా దేవాలయం వద్దకు రూ. 110 కోట్ల వ్య యం తో దేవాలయం వద్దకు నేరుగా వెళ్లేలా 3.7 కిలోమీ టర్ల ఘాట్ రోడ్డు నిర్మాణానికి సీ ఎం శంఖుస్థాపన ( foundation) చేశారు. ముఖ్యమంత్రికి దేవస్థానం అర్చ కులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద పండితులు, అర్చ కులు ఆశీర్వచనం అందచేశారు. తొలు త దేవాలయ గోపురం వద్ద కురు మూర్తి స్వామి దేవస్థానానికి రోడ్డు మార్గం ఏర్పాటుకు 3.7 కి .మీలు ఘాట్ రోడ్డు , ఎలివెటెడ్ కారిడార్, దేవస్థాన ఇతర అభివృ ద్ధి పనులకు 110 కోట్లు నిధులతో మంజూ రు చేసిన పనులకు శంకు స్థాపన చేశారు.
అనంతరం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి( cm revanth re ddy) మాట్లాడుతూ నిరు పేద ప్రజలు ఎవరైతే తిరుమల తిరుపతి ( ttd) వెళ్లి వేంకటే శ్వర స్వామిని దర్శించుకోలేరో ఎలాంటి వారు దేవరకద్ర నియోజ కవర్గంలోని కురుమూర్తి స్వామి ( kuru mur thy swamy) దేవ స్థానానికి వెళ్లి వేంకటేశ్వర స్వామి దర్శనం చే సుకుంటారని అన్నా రు.అలాంటి మహత్తర ప్రత్యేకత కలిగిన దేవా లయానికి ( temple) సరైన రోడ్డు మార్గం లేక పోవడంతో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, దర్శించుకోలేకపోతున్నారని స్థానిక శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి చెప్పడంతో వెం టనే రూ. 110 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని నిరు ద్యోగులకు మాత్రమే అమర్ రాజా బ్యాటరీ( amar raja bataries) సంస్థలో ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని సంస్థ తో మాట్లాడటం జరిగిందని, వేరు అందుకు ఒప్పుకున్నట్లు తెలిపారు. రా నున్న రోజుల్లో జిల్లాలో వచ్చే పరిశ్ర మలు ఇక్కడి నిరుద్యోగులకు నైపు ణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు. జిల్లాలోని ప్రధా న దేవాలయాలు మన్యంకొం డ, కురుమూర్తి దేవస్థానం అభి వృద్ధికి అవసరమైన ప్రణాళికలు దేవాదాయ శాఖ వారితో చర్చించి నివే దికలు ఇవ్వాలని ఈ రెండు దేవాలయాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటున్నట్లు తెలి పారు. జిల్లాలో ప్రతి తాండాకు బి.టి రోడ్డు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వాల్సిందిగా వేదిక నుండి కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఉమ్మడి మహబూబ్ నగర జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ ( damodara rajanarshi hma) మాట్లాడుతూ ఈరోజు తనకు కురు మూర్తి స్వామి దర్శన భాగ్యం కలగ టం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ దేవ స్థానానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని, పేదల తిరుపతిగా భా వించే ఈ ప్రాంత భక్తులు, పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్ర భక్తులు దర్శ నం చేసుకొని స్వామి వారికి కుండలు, చాటలతో మొక్కులు తీర్చు కుంటారని తెలి పారు. పేద ప్రజల అభివృద్ధి, సం క్షేమానికి ప్రభు త్వం కట్టుబడి పని చేస్తుందని తెలిపారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టి రెడ్డి వెంకట్ రెడ్డి ( komatireddy venkatreddy) మాట్లా డుతూ వెనుకబడిన పా లమూరు జిల్లాలోని కురుమూర్తి దేవస్థానా నికి ఘాట్ రోడ్డు ఏర్పాటు కు నిధులు మంజూరు చేయాలని అక్టోబ ర్ 11న స్థానిక శాసన సభ్యు లు కోరితే నవంబర్ 10 న రూ. రూ. 110 కోట్ల నిధులతో ఘాట్ రోడ్డు, ఎలివేటర్ కారిడార్, ఇతర పను లకు శంఖుస్థాపన చేసుకున్న ట్లు తెలిపారు.వచ్చె బ్రహ్మోత్సవాల వరకు ఘాట్ రొడ్డును ప్రారంభోత్స వం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు జి. మ ధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అడిగిన వెంటనే దేవస్థానానికి నిధు లు మంజూరు చేసి నేడు స్వ యంగా శంఖుస్థాపన చేసేందుకు విచ్చే సిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లేల చిన్నా రెడ్డి, మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి, దేవరకద్ర నియోజక వర్గ శాసన స భ్యులు జి.మధు సూదన్ రెడ్డి,శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,జిల్లా ఎస్పీ జానకి,అదనపు కలెక్టర్ లు శివేంద్ర ప్రతాప్,మోహన్ రావు,వివిధ శాఖల అధికారు లు,తదితరులు పాల్గొన్నారు.
Cm revanthreddy palamooru