CM Revanth Reddy: హరీశ్ రావ్ కౌంటర్ ఎటాక్
మెదక్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. మెదక్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదు
ఉద్దేశపూర్వకంగానే నిందలు వేస్తున్నారు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె్ల్యే హరీశ్ రావ్
ప్రజాదీవెన, హైదరాబాద్: మెదక్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. మెదక్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత జిల్లా అయిన మెదక్‌కి ఏమి చేయలేదు అని సీఎం రేవంత్(CM Revanth Reddy) కౌంటర్ చేశారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేసారు. ఆ తరువాత అంతే స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్‌కి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలదీస్తే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీష్ రావు అన్నారు.
నీళ్ళు, నిధులు అన్ని గజ్వేల్కే వెళ్తున్నాయి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ అన్నాట్లు గుర్తుచేశారు. అయితే ఇప్పుడేమో గజ్వేల్ అభివృద్ధి ఇందిరాగాంధీ హయాంలో అయింది అని అంటున్నారని విమర్శించారు. గజ్వేల్, సిద్దిపేటకు రైల్ తెచ్చింది కేసీఆర్ అని అంటే మూడు యూనివర్సిటీలు తెచ్చింది కూడా కేసీఆర్(KCR) అని గుర్తు చేశారు. సీఎం రేవంత్ (CM Revanth)ఉద్దేశ పూర్వకంగానే తమపై నిందలు వేస్తున్నారని చెప్పారు. మెదక్ జిల్లాలో మంచి ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది అని.. సింగూర్ జలాలను మెదక్ జిల్లాకు(Medak) వచ్చేలా చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు.
తమని సీఎం రేవంత్ విమర్శించినప్పుడు.. తాము కూడా ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు ఉందని చెప్పారు. కానీ తమకు ఉన్న విజ్ఞత కారణంగా విమర్శించడం లేదన్నారు హరీష్ రావు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీ అమలు చేస్తానని ఇంత వరకు అమలు చేయలేదని ఆరోపించారు. పార్టీలు మారిన వారిని తక్షణమే అనర్హత వేటు వేస్తామని రాహుల్ గాంధీ మానిఫెస్టోలో పెట్టారు. కానీ ఇక్కడ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మారిన వారికి కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. అత్యధిక ఎమ్మెల్యే సీట్లు(MLA Seats)బీసీ, ఎస్సీలకు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని, బీసీలను, ఎస్సీలను మోసం చేసింది సీఎం రేవంత్ అన్నారు. మైనార్టీల ఓట్లు వేసుకుని గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. మైనార్టీలకు క్యాబినెట్లో అవకాశం కల్పించలేదన్నారు.
CM Revanth’s comments are not correct