Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cmrevanthreddy : నల్లగొండ గడ్డపై మరోమారు మాటిస్తున్నా, సంక్రాంతికి బరాబర్ ‘భరోసా’

--మూసీ నది పునర్జీవoతో జిల్లా వాసులకు కాలుష్య విముక్తి --యుద్ధప్రాతిపదికన ఉమ్మడి జిల్లా సాగునీటి సరఫరా పనులు --ఆనాడు వైఎస్సార్ చేతుల మీదు గా రింగ్ రోడ్డు, నేడు వెంకన్న చేతు ల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు --జనవరిలో ఎస్ఎల్ బిసి పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి --నల్లగొండ బహిరంగ సభ లో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

నల్లగొండ గడ్డపై మరోమారు మాటిస్తున్నా, సంక్రాంతికి బరాబర్ ‘భరోసా’

–మూసీ నది పునర్జీవoతో జిల్లా వాసులకు కాలుష్య విముక్తి
–యుద్ధప్రాతిపదికన ఉమ్మడి జిల్లా సాగునీటి సరఫరా పనులు
–ఆనాడు వైఎస్సార్ చేతుల మీదు గా రింగ్ రోడ్డు, నేడు వెంకన్న చేతు ల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు
–జనవరిలో ఎస్ఎల్ బిసి పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి
–నల్లగొండ బహిరంగ సభ లో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: మూసీ నది పునర్జీవ ప్రాజెక్టును నిర్మించి నల్గొండ జిల్లా వాసులకు పారిశ్రామిక వ్యర్ధాలు, కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ప్రజా పాలన –ప్రజా విజయోత్సవాలలో భాగం గా శనివారం నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎస్.ఎల్.బీ.సి. వద్ద రాజీవ్ ప్రాంగణంలో నిర్వహించిన బహిరం గ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొ న్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,  ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవ సాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మాత్యులు తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర నీటి పారు దల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు, భవ నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి, మంత్రి వర్గ సహచరు లు, విప్ బిర్లా ఐలయ్య, ఎంపీలు రఘువీర్ రెడ్డి, చా మల కిరణ్ కు మార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహ భరితంగా సాగింది.

పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవా నికి నల్గొండ జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికు ఇన్చార్జి మంత్రి తు మ్మల నాగేశ్వర రావు, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్గొండ పోలీస్ కమీషనర్ శరత్ చంద్ర పవార్, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్ లు, ప్రజాప్రతినిధు లు, అధికారులు ఘన స్వాగతం పలికారు. నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచ రులతో కలిసి బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథ కం డెలివరీ చానల్స్ ను ప్రారంభించి పైలాన్ ను ఆవిష్కరించారు.

దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండవ యూనిట్ ను ముఖ్య మంత్రి ప్రారం భించి జాతికి అంకితం చేశారు. అనంతరం నల్గొండ జిల్లా కేంద్రంలో 42 ఎకరాలలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం ప్రారంభోత్స వానికి వచ్చిన ముఖ్యమంత్రికి వేద మంత్రాలతో పురోహితులు ఆహ్వా నం పలికారు. వైద్య కళాశాలను ప్రారంభించి అదే ప్రాంగణంలోరూ. 40 కోట్లతో నిర్మించే నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు, ప్రభు త్వ ఆసుపత్రి అదనపు బ్లాక్ పను లకు సీఎం శంకుస్థాపన చేశారు.

ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలికి చేరుకున్న  ముఖ్యమంత్రి బ్యాంకు లింకేజ్ ద్వారా 815 కోట్ల 73 లక్షల రూపాయల చెక్కును స్వ శక్తి మహిళా సంఘాలకు అందజే శారు.  నల్గొండ పట్టణంలో సెట్విస్ ద్వారా రెండు కోట్ల రూపాయలతో మహిళల కోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ప్రారంభో త్సవం, 15 కోట్ల రూపాయలతో నిర్మించే హరిత హోటల్, నల్గొండ పట్టణంలో 109 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులు, 10 కోట్లతో నిర్మించే నూతన గ్రంథాలయ భవ నం, కనగల్,  తిప్పర్తి మండలా లలో నూతనంగా మంజూరైన జూనియర్ కళాశాల నిర్మా ణ పనులకు శంకుస్థాపన కార్యక్ర మాలను సీఎం రేవంత్ రెడ్డి వర్చు వల్ గా పూర్తి చేశారు.

అనంతరం రాజీవ్ ప్రాంగణంలో బహిరంగ సభకు హాజరై ప్రజలను ద్దేశించి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లా డుతూ సంవత్సరం క్రితం డిసెంబర్ 7, 2023న  హైదరాబాద్ లోను ఎల్బి స్టేడియంలో తెలం గాణ ప్రజ ల ఆశీర్వాదంతో ఇందిరమ్మ రా జ్యం ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీ కారం చేసిందని, చరిత్రలో 2 జూ న్,2014 కు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ 7,2023కు,డిసెం బర్ 7, 2024 కు అంతే ప్రాధా న్యత ఉందని అన్నారు.తెలంగాణ ఉద్యమానికి నాయ కత్వం వహించ డంలో నల్గొండ జిల్లా ముందు వరు సలో ఉందని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పదవి త్యాగం చేసిన మహనీయు డు కొండా లక్ష్మణ్ బాపూజీ భువనగిరి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిం చారని, మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పద వి త్యాగం చేసింది కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అని సీఎం గుర్తు చేశా రు.

మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన అమర వీరుడు శ్రీకాంత్ చారి ది నల్గొండ జిల్లా అని, నిజాం లను తరిమి కొట్టిన సాయుదరం గ  రైతు పోరాటానికి నల్గొండ జిల్లా నాయకత్వం వహించిందని, సాయు ధ పోరాటం నుంచి ఎర్ర జెండాల పోరాటం వరకు నల్గొండ ముందు ఉందని సీఎం తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరైడ్ మహమ్మరితో బాధ పడిన నల్గొండ జిల్లా, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవ త్సరాల కాలంలో కూడా విముక్తి కల్గ లేదని, ప్రత్యేక తెలంగాణ రా ష్ట్రం ఏర్పడితే నల్గొండ జిల్లా బాగు పడుతుందని ఆశించామని, ఫ్లోరైడ్ శాశ్వత పరిష్కారం కోసం ఎస్.ఎల్.బీ.సి , ఉదయ సముద్రం ప్రాజెక్టులు పూర్తి చేయాలని, 44 కిమి సొరంగ పనులను  ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నా రు.

3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 పైగా గ్రామాలకు త్రాగు నీరు అందించే ఎస్.ఎల్.బీ.సి, లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే ఉద య సముద్రం ప్రాజెక్టు వైఎస్సార్ హయాంలో మంజూరు చేశారని,  కేసిఆర్ సొరంగ పనులను, ఉదయ సముద్రం ప్రాజెక్టులను ఎందుకు నిర్లక్ష్యం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే నల్గొండ జిల్లాకు అన్యా యం జరిగిందని అన్నారు. సాగు నీటి పారుదల శాఖ మంత్రిగా నల్గొండ జిల్లా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి అప్పగించామని, చిన్న ప్రాజెక్టు నుంచి పెద్ద ప్రాజెక్టు వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులకు నిధులు గ్రీన్ చానెల్ లో విడుదల చేస్తామని, ఎస్.ఎల్. బీ.సీ, ఉదయ సముద్రం, పిల్లాయ కాలువ, ధర్మా రెడ్డి కాల్వ మొదల గు పనులు వేగవంతంగా పూర్తి చేసి కృష్ణ, గోదావరి జలాలను తర లించి దేశానికే ఆదర్శంగా నిలబెడతామని అన్నారు.

గతంలో వరి వేస్తే ఉరి అనే మాట కేసిఆర్ చెప్పారని, నేడు 8500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరతో పాటు సన్నా లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేస్తున్నామని, నల్గొండ జిల్లాలో 5 లక్షల 12 వేల ఎకరాల్లో వరి పంట సాగు జరిగిం దని, కొనుగోలు చేసిన వెంటనే ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని అన్నారు.దేశంలో అత్యధికంగా 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, నల్గొండ రైతాంగం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.

గతంలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా ప్రజా క్షేత్రం వదిలి పెట్టకుండా మేం పోరాటం చేశామని, ఫ్యాక్టరీ, పరిశ్రమలు, ఆర్.ఆర్.ఆర్, ఫ్యూ చర్ సిటి, మెడికల్ కాలేజీ, ఫాక్స్ కాన్ కంపెనీ వంటి ప్రతి అంశానికి ప్రతి పక్ష నాయకులు అడ్డు పడుతున్నారని సీఎం మండిపడ్డారు. పరీక్షలు పెట్టవద్దు, ఉద్యోగాలు ఇవ్వ వద్దు, అనే రీతిలో ఉంటే ఎలా అని,1200 మంది అమరుల త్యాగం కుటుంబ ప్రయోజనం కోసమా అని సీఎం రేవంత్ రెడ్డి కేసిఆర్ ను ప్రశ్నించారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చిన తర్వాత మొదటీ సంవత్సరంలో 55 వేల 143 ఉద్యో గాలు ఇచ్చింది తమ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.

గత 26 సంవత్సరాలలో గుజరాత్ , యూపి, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ని ఎక్కడైనా 55 వేల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇచ్చారా? అని ప్రశ్నించారు. మొదటి సంవత్సరంలో 25 లక్షల 50 వేల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రం ది మాత్రమేనని, నల్గొండ జిల్లాలో 2 వేల 4 కోట్లు రుణమాఫీ జరిగిం దని అన్నారు.గతంలో రైతులకు ఉచిత విద్యుత్ ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, నేడు 50 లక్షల కుటుంబాలకు 200 యూ నిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని అన్నారు.500 రూపాయ లకే సబ్సిడీ పై గ్యాస్ సిలిండర్ సరఫరా, కార్పోరేట్ ఆసుపత్రులలో 10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం, 26వేల పాఠశాలల్లో చదు వుతున్న 30 లక్షలకు పైగా విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తూ, పేద విద్యార్థుల కోసం 40 శాతం డైట్ చార్జిలు పెంపు, 21 వేల పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, 30 వేల మంది ఉపాధ్యాయులకు బదిలీలను పారదర్శకంగా నిర్వహించామని అన్నారు.

సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని, సన్న వడ్లే రైతులు పండించాలని, బోనస్ 500 చెల్లించి కొనుగోలు చేస్తా మని, రేషన్ లో సన్న బియ్యం సరఫరా చేస్తామని, రైతులు ఎటువం టి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆనాడు వై ఎస్సార్ చేతుల మీదుగా రింగ్ రోడ్డు కట్టామని , నేడు వెంకన్న చేతు ల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని అన్నారు. 50 వేల ఎక రాల్లో కొత్త సిటీ నిర్మించి నిరుద్యోగ సమస్య పరిష్కరించేలా అంత ర్జాతీయ కంపెనీలను తీసుకొని వస్తామని సీఎం తెలిపారు.నల్గొండ ప్రజల కష్టాల చూసి మూసి నది ప్రక్షాళన చేపట్టామని, మూసి ప్రాజె క్టు కట్టకపోతే నల్గొండలో ఎవరు బ్రతుకలేరని, మూసి ప్రాజె క్టు కట్టి నల్గొండ జిల్లాకు పరిశ్రమల వ్యర్థాల, కాలుష్యం నుంచి విముక్తి కల్పి స్తామని అన్నారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ 10 సంవ త్సరాల కేసిఆర్ పాలనలో నల్గొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, ప్రజా ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అవసరమైన పర్యావరణ అనుమతులను ప్రజా ప్రభుత్వం సాధించిందని, ప్రతి నెలా రివ్యూ చేస్తూ యాదాద్రి పవర్ ప్లాంట్ ను గ్రిడ్ కు అనుసం lధా నం చేశామని అన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు దగ్గర మోటార్ లను ప్రారంభించి రిజర్వాయర్ లోకి నీటి విడుదల చేశామని ఒక వైపు కరెంట్, మరో వైపు నీళ్ళు ఇంకోవైపు ప్రజా వైద్యశాలను నల్గొం డ జిల్లాలో ఒకే రోజు ప్రారంభించామని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొసం గతంలో 70 కోట్ల ఖర్చు చేస్తే నేడు 5 వేల కోట్ల బడ్జెట్ లో కేటాయించి ఖర్చు చేస్తున్నామని అన్నా రు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ దేవరకొండ ఎస్.ఎల్.బీ .సి సొరంగంలో 9.5 కిమీ పనులు మిగిలాయని, ప్రపంచంలో ఆధు నిక సాంకేతిక తీసుకొని వచ్చి 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తా మని, ఉదయ సముద్రం క్రింద 6 నెలలో 50 వేల ఎకరాల, సంవత్స ర కాలంలో లక్ష ఎకరాల్లో నీరు అందిస్తామని అన్నారు.మూసి నది క్రింద 3 కాలువలు మంజూరు చేసి రైతులకు పుష్కలంగా సాగునీరు విడుదల చేస్తామని, సాంకేతిక కారణాల వల్ల 1.2 టిఎంసి లతో గం డమల రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పై ఉన్న లిఫ్ట్ మరమ్మత్తులు 100 శాతం పూర్తి చేస్తామని అన్నారు. నక్కల గండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నెల్లికల్లు లిఫ్ట్ 2 దశలో, డిండి ప్రాజెక్టు ప్రత్యేక శ్రద్ధ తో పూర్తి చేస్తామని అన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆనాడు దివంగత నేత వైయస్సార్ హయాంలో కొట్లాడి ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు 65 శాతం, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు ను 75 శాతం పూర్తి చేసుకున్నా మని, గత 10 సంవత్సరాలుగా నల్గొండపై కక్ష కట్టి ప్రాజెక్టు పనులు నిలిపివేశా రని తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కంపెనీలతో మాట్లా డి రెండవ బోర్ యంత్రం రిపేర్ చేస్తున్నామని, జనవరి నెలలో ఎస్ ఎల్ బి సి పనులు ప్రారంభించి 2 సంవత్సరాలలో పూర్తి చేస్తామని, బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు కాల్వ పనులు మూడు నెలల్లో పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు.

కనిగల్, తిప్పర్తి మండలాల్లో జూనియర్ కళాశాల పనులకు శంకుస్థా పన చేశామని, 300 కోట్లతో నిర్మించిన వైద్య కళాశాల ప్రారంభిం చా మని, 40 కోట్లతో నర్సింగ్ కళాశాల పనులకు శ్రీకారం చుట్టామని,  దర్గా రొడ్డు కు 140 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.నల్గొండ కు ఒక డెంటల్ కళాశాల ను నల్గోండ కు మంజూరు చేయాలని, శివ న్న గూడెం, బస్వాపూర్, గండమల రిజర్వాయర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని,40 లక్షల జీవితాలకు ఆశ కల్పించే విధంగా మూసీ నది పునర్జీవన పథకం చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కప్ పై రూపొందించిన పాటలసిడిని ఆవిష్క రించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రెవిన్యూ ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ,కుందూరు రఘువీర్ రెడ్డి,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య ,బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, కంభంపాటి అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్, జైవీర్ రేడ్డి , ఎమ్మెల్సీ నర్సి రెడ్డి ,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ ,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తదిత రులు పాల్గొన్నారు.

Cmrevanthreddy