Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cmrevanthreddy : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి, తెలంగాణ తల్లిని పునఃప్రతిష్టించుకోవడం సంతోషం

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి, తెలంగాణ తల్లిని పునఃప్రతిష్టించుకోవడం సంతోషం

ప్రజా దీవెన, హైదరాబాద్: భూప్ర పంచంపై ఏ ప్రాంతానికైనా ఒక గు ర్తింపు, అస్తిత్వం తల్లి అని సంస్కృ తికి, సంప్రదాయాలకు ప్రతి రూ పం తల్లి అంటూ ప్రజలు దశాబ్దాల పా టు పోరాటం చేసి సాధించు కున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిని పునఃప్రతిష్టిం చుకోవ డం ప్రజ లందరికీ గర్వకరణం,సంతోష కర మైన సందర్భమని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణకు గుండెకాయలాంటి స చివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక అద్భుతమైన కార్యక్రమంగా, చరిత్రపుటలలో శాశ్వతంగా నిలిచిపో యేఘట్టమని అన్నారు.

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క, మంత్రివర్గ సహచరులతో కలి సి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం రేవం త్ రెడ్డి ప్రసంగం యావత్తు ఆయన మాటల్లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు తెలంగాణ తల్లి రూపం ఇలా ఉం డాలని గానీ, ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా చేయాల ని గానీ ఏ రోజూ ఆలోచన చేయ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాకారమైన తర్వాత ప్రజల ఆకాం క్షలకు అనుగుణంగా నిర్ణయాలు జరుగుతాయని ఆశించాం.

మన సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది. మన తల్లిని గౌరవించు కుంటామని ఆశించాం. ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు యువ కులు తాము నడిపే వాహనంపై టీజీ అని రాసుకోవడమే కాకుండా గుండెలపై పచ్చబొట్లు పొడిపించుకున్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మ న ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజా ప్రభుత్వం వచ్చిన త ర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీజీ అని మార్చాం, తెలం గాణ ఉద్యమ కారులకు స్ఫూర్తినిచ్చి నిలబడ్డ అందేశ్రీ గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రా ష్ట్రంలో, సమైక్య పాలనలో ఎన్నో సార్లు చెప్పుకున్నా, రాష్ట్రం ఏర్ప డ్డాక అది జరగలేదు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గేయా న్ని అధికారిక గేయంగా ప్రకటిం చుకున్నామన్నారు. కవి గూడ అంజయ్య, ప్రజాకవి గద్దర్, బండి యాదగిరి, గోరటి వెం కన్న, సుద్దాల అశోక్ తేజ, పైడి జయ రాజ్ , పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి లాంటి ఎందరో తెలం గాణ ప్రముఖులను లేదా వారి కుటుంబాలను సన్మానించాలని నిర్ణయిం చాం. వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల చొప్పున స్థలంతో పాటు కోటి రూపాయల నగదు, తామ్రపత్రం బహుమతిగా అందజేస్తాం. ప్రతి ఏటా తెలంగాణ తల్లిని ప్రతిష్టించుకున్న రోజును (డిసెంబర్ 9 న) ఒక పండుగలా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికా రికంగా రాష్ట్ర స్థాయి లో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, ప్రభు త్వ కార్యక్రమంగా నిర్వహిస్తాం.

భవిష్యత్తులో తెలంగాణ తల్లి నమూనాను మార్చాలన్నా, ఈ కార్య క్రమాన్ని ఎవరైనా అవమానించాలని ప్రయత్నం చేసి నా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నాలుగు కోట్ల ప్ర జల ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవం తం చేసిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలి పారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్ బాబు , దామోదర్ రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణా రావు , కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు పలు వురు ఎంపీలు, ఎమ్మె ల్సీలు, ఎమ్మె ల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతిని ధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ తో పాటు రాష్ట్రానికి చెందిన ఐఏఎ స్, ఐపీఎస్, ఐఎఫ్ఎ స్ అదికారు లు, వివిధ శాఖల ఉన్నతాధికా రులు హాజరయ్యారు.

Cmrevanthreddy