Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMrevanthreddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, అప్పుడైనా, ఇప్పుడైనా అభివృద్ది కాంగ్రెస్ తోనే 

సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, అప్పుడైనా, ఇప్పుడైనా అభివృద్ది కాంగ్రెస్ తోనే 

 CMrevanthreddy : ప్రజా దీవెన, హైదరాబాద్:ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో గానీ, ఇప్పు డు తెలంగాణ రాష్ట్రంలో గానీ హైద రాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కుతుందని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 11 కిలోమీటర్ల అత్యంత పొడవైన స్వర్గీ య పీవీ నరసింహా రావు ఫ్లైఓవర్‌ నిర్మితమైతే, మళ్లీ ఇప్పుడు కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కిలోమీటర్ల మేర రెండో అతి పొ డవైన స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ ను నిర్మించామని, తద్వారా తమకు తామే పోటీ అని నిరూపించు కున్నట్టయిందన్నా రు.

నూతనంగా నిర్మించిన ఆరాంఘర్-జూపార్క్ 4కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవై సీ, స్థానిక ఎమ్మెల్యేలు, మేయర్ లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారం భించారు. అలాగే చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం పరి ధిలో రూ.301 కోట్లతో సీవరేజ్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. ఈ సం దర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి సీఎం మాట్లా డారు.

ఆరాంఘర్- జూపార్క్ ఫ్లైఓవ ర్‌కు దివంగత ప్రధానమంత్రి డాక్టర్ మ న్మోహన్ సింగ్ పెరు పెడుతు న్నట్లు హర్షధ్వానాల మధ్య ముఖ్య మం త్రి ప్రకటించారు.”హైదరాబాద్ నగర అభివృద్ధే తెలంగాణ అభి వృ ద్ధి. హైదరాబాద్ అభివృద్ధి కోసం రోడ్ల విస్తరణ, మెట్రో రైలు విస్తర ణ, గోదావరి జలాలు తేవడం ద్వారా తాగునీటి సమస్యల పరిష్కారం, మూసీ పునరుజ్జీవం శాంతి భద్ర తల పరిరక్షణ, నిరుద్యోగ యువకు లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక కార్య క్రమాలు తీసుకుని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్నామన్నారు.

హైద రా బాద్ నగరానికి లేక్స్ అండ్ రాక్ సిటీ గా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు ఉంది. ఆనాడు నిజాం చేసిన అభి వృద్ధిని పరిరక్షించుకొ ని ఉండుంటే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ తో పోటీ పడే నగర మే ఉండకపో యేది కానీ కాలక్రమేణా కబ్జాదా రులు, ఆక్రమణల వల్ల నగర సుం దరీకరణ పూర్తిగా దెబ్బతి న్నదని విచారం వ్యక్తం చేశారు. ఈరోజు నగరంలో చిన్న వర్షం వచ్చినా వరదలు వస్తున్నా యి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరిం చుకోవాలనే ఆలోచనతో నే ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు.

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభి వృద్ధి గురించి మాత్రమే ఆలో చన, ఇప్పుడు హైదరాబాద్ అభి వృద్ధి కోసం ఎంఐఎంతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.ఈ రోజు ప్రారం భమై న చర్లపల్లి టర్మినల్ చా లా ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ను ఒక పెద్ద రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన భూ మి సేకరణ, ఇతర అనుమతు ల పనులన్నీ పూర్తి చేశామని తెలి పారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడాను.

తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 10 ఏండ్ల పాటు మెట్రో రైలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్న విషయాన్ని గుర్తుచే శానన్నా రు. ముఖ్యంగా గౌలిగూడ, ఫలక్‌నుమా, చాంద్రా యణగుట్ట వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మెట్రో పనులు ఏకంగా ఒక్క ఇటుక కూ డా వేయలేదని, అందుకే హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతి పాదనలను గురించి చెప్పి కేంద్ర మంత్రిమండలి ఆమోదించాల్సిం దిగా అభ్యర్థించానన్నారు.

ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం కూడా అత్య వసరం. రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే తెలంగాణ మరింత వేగంగా అభి వృద్ధి చెందుతుందని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు లభిస్తాయని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్‌తో పాటు, రీజినల్ రింగ్ రైలును కూడా కేంద్రా న్ని కోరాం. వికారాబాద్ – కొడం గల్ – కృష్ణా రైల్వే లైన్ కూడా కోరామని వివరించారు. తెలంగా ణ ప్రజల ప్రయోజనాల కోసం ఎవ రితోనైనా కలుస్తా, ఎవరితో నైనా పోరాడుతాన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నా శక్తివంత మైన కృషిని కొనసాగిస్తామన్నారు.

హైదరాబాద్ నగరానికి సంబంధించి కొన్ని అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు ఒక డాక్యుమెంట్ తయారు చేసారు. కొద్దిరోజుల్లోనే హైదరాబా ద్ ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబంధిత అధికారుల తో ఒక సమావేశం నిర్వహిస్తా మన్నారు. హైదరాబాద్ పాత నగరం నిజానికి ఓల్డ్ కాదు, ఒరిజి నల్ సిటీ, ఇది అసలైన నగరం అందుకే మా ప్రభుత్వం ఒరిజినల్ సిటీ అభివృద్ధికి ప్రాధాన్యంఇస్తుందన్నారు.