Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMrevanthreddy: కొందరు కలెక్టర్లు ఏసీ రూములొదిలి బయటకు వెళ్లడంలేదు

--సానుకూల దృక్ఫథంలో సివిల్స్ అధికారులు ఉండాలి -- ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కొందరు కలెక్టర్లు ఏసీ రూములొదిలి బయటకు వెళ్లడంలేదు

–సానుకూల దృక్ఫథంలో సివిల్స్ అధికారులు ఉండాలి
— ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CMrevanthreddy:  ప్రజా దీవెన, హైదరాబాద్: సమస్య లను పరిష్కరించడంలో సివిల్ స ర్వీస్ అధికారులు ప్రజలకు ఉప యోగ పడే విధంగా సానుకూల దృక్ఫథం కలిగి ఉండాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న అధికారులు ప్రజల మనసుల్లో ఎక్కువ కాలం గుర్తుం టారని చెప్పారు.ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ రాసిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి’ (Life of a Karma Yogi) పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ” గతంలో ఐఏఎస్ అధికారులు ని త్యం ప్రజల్లో ఉండేవారు. ఆ కారణంగానే రాజకీయ నాయకుల కం టే అధికారులనే ప్రజలు ఎక్కువ గా గుర్తుంచుకునే వారు. ముఖ్యం గా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిం చడం వల్ల సమస్యలకు పరిష్కా రం దొరుకుతుంది. కానీ కొందరు కలె క్టర్లు ఏసీ రూములను వదిలి బయటకు వెళ్లడం లేదు. కలెక్టర్లు, ఎస్పీ లకు జిల్లా స్థాయిలో గడించే అను భవమే కీలకమవుతుంది. అధికారుల్లో మార్పు రావలసిన అవ సరం ఉంది. నిబద్ధత కలిగిన అధికారు లకు ఎప్పుడూ గుర్తింపు ఉం టుంది.

రాజకీయ నాయకులు నిర్ణయాలు చేసినప్పుడు వాటిలోని అంశాల ను విశ్లేషించి వివరించాల్సిన బా ధ్యత సివిల్ సర్వీసెస్ అధికారుల దే. బిజినెస్ రూల్స్ వివరించాలి. కొందరు వాటిని విస్మరిస్తున్నారు. అది సమాజానికి మంచిది కాదు. అధికారుల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి.ఎంతో నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్ గారు, పారదర్శక ఎన్నికల నిర్వహ ణకు ఎంతో కృషి చేసిన గొప్ప వ్య క్తి శేషన్ గారు, దేశాన్ని ఆర్థికంగా అభి వృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మో హన్ సింగ్ లాంటి వారి అనుభవా ల నుంచి కొత్తగా సర్వీసు లో చేరుతున్న సివిల్ సర్వెంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది.

ఆరు దశాబ్దాల అనుభవాన్ని ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారు. మనం ఏదైనా కొనొచ్చు. కానీ అనుభవాన్ని కొనలేం. సివిల్ సర్వెంట్స్ అంద రికీ గోపాలకృష్ణ పుస్తకం వెలకట్టలేనిది. అందరికీ ఒక దిక్సూచిగా ఉంటుంది. తొలి ప్రధానమంత్రి నెహ్రూ కాలం నుంచి నేటి ప్రధాని మో దీ వరకు అనుభ వం కలిగిన గోపాలకృష్ణ క్లోజ్డ్ ఎకా నమీ నుంచి ఓ పెన్ ఎకానమీ వరకు దేశంలో మార్పులకు ప్రత్యక్ష సాక్షి. భవిష్యత్తు ను కూడా వారు విజు వలై జ్ చేయగలుగుతున్నారని వివరించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అసో సియేషన్ వైస్-ప్రెసి డెంట్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావుతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎ స్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.