Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMrevanthreddy AI : భవిష్యత్తు భరోసా ‘ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్’

-- పౌర సేవలు, పరిపాలనలోనూ కృత్రిమ మేధకు ప్రాధాన్యం --500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యా బోధనలు --మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు ఉపాధి అవకాశాలు --మైక్రోసాఫ్ట్, రాష్ట్ర ప్రభుత్వం సం యుక్త నిర్వహణ -- మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారం భించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భవిష్యత్తు భరోసా ‘ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్’

— పౌర సేవలు, పరిపాలనలోనూ కృత్రిమ మేధకు ప్రాధాన్యం
–500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యా బోధనలు
–మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు ఉపాధి అవకాశాలు
–మైక్రోసాఫ్ట్, రాష్ట్ర ప్రభుత్వం సం యుక్త నిర్వహణ
— మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారం భించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CMrevanthreddy AI: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠ శాలల్లో మైక్రోసాఫ్ట్ సంస్థ, రాష్ట్ర ప్ర భుత్వం సంయుక్తంగా ఏఐ ఎ డ్యుకేషన్ ను ప్రవేశపెట్టబోతున్నా య ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. ఏఐ ఫౌం డేషన్ అకాడమీ ద్వారా ఈ సేవ లను అందించబోతున్నట్టు చెప్పా రు. పౌర సేవలు, ప్రభుత్వ పాలన లోనూ కృత్రిమ మేధను వినియో గించుకో బోతున్నట్టు వివరించారు. గురువారం ఆయన గచ్చిబౌలిలో మైక్రో సాఫ్ట్ ఇండియా నూతన భవ నాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం  మాట్లా డుతూ మైక్రోసాఫ్ట్ తో తెలంగాణకు దశాబ్దాల అనుబంధం ఉందని, ఇ టీవల సిల్వర్ జూబ్లీ నిర్వహిం చిం దని గుర్తు చేశారు. మైక్రో సాఫ్ట్ సం స్థ గ్లోబల్ ఇన్నోవేషన్ ను హైద రా బాద్ నుంచి క్రియేట్ చేసిందని సీ ఎం చెప్పారు. తెలంగాణ ప్రభు త్వంపై విశ్వాసంతో ఇక్కడ పెట్టుబ డులు పెట్టేందుకు ముందు కు వ చ్చిన ఆ సంస్థ నాయకత్వానికి ము ఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మైక్రో సాఫ్ట్ కొత్త ఫెసిలీ సెంటర్ విస్త రణ ద్వారా ఇక్కడి యువతకు ఉద్యోగావకాశాలు లభించబోతు న్నాయని చెప్పారు.

ఈ పెట్టుబడి వచ్చే మూడేండ్లలో రాష్ట్రంలోని 93 లక్షల ఇండ్లకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించనున్నా మని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చె ప్పారు. మైక్రోసాఫ్ట్ భవన ప్రారంభో త్సవంలో ఆయన మాట్లాడుతూ సత్యనాదెళ్ల చొరవతోనే మైక్రోసాఫ్ట్ తన సేవలను తె లంగాణలో విస్తరి స్తోందని చెప్పారు. ఏఐ క్లౌడ్ టెక్నా లజీ అభివృద్ధి లో సత్యనాదెళ్ల కృషి ఎంతో ఉందని చెప్పారు. హైదరాబాద్ ను గ్లోబ ల్ హబ్ గా తీర్చి ద్దేం దుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ట్రిపుల్ ఆర్, మెట్రో విస్త రణ, ప్యూచర్ సిటీ నిర్మాణ పనులు ప్రారం భమయ్యాయని చెప్పారు.

తెలంగాణలో బిజినెస్ ఫ్రెండ్లీ వాతా వరణం కల్పిస్తున్నామని అ న్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలో పేతం చేయడంతోపాటు మెంటర్షి ప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్వర్క్ యాక్సె స్ ను ఇస్తుందని చెప్పారు. కేంద్రం క్లౌడ్ బేస్డ్ ఏఐ ఇన్ ఫ్రాస్ట్ర క్చర్ అభివృద్ధి చేస్తుందని భావి స్తు న్నామని చెప్పారు. ఏఐ నాలెడ్జ్ హబ్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.