సీఎం రేవంత్ అప్పీల్, ప్రజల్లోకి విస్తృతంగా భూభారతి
CMrevathreddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వ త పరిష్కారం చూపేందుకు తీసుకొ చ్చిన ‘భూ భారతి’ని ప్రజల్లోకి వి స్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్య మంత్రి ఎ. రేవం త్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని కో రారు. తెలంగాణలో వివా దరహిత భూ విధానా లు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయ త్నమని స్ప ష్టం చేశారు. ఆధార్ తరహాలో భవిష్యత్‌లో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూ ధార్’ తీసుకొస్తామని ప్రకటించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి శుభసందర్భంగా ప్రభుత్వం నూ తనంగా తెచ్చిన భూ భారతి చట్టం, భూ భారతి పోర్టల్‌ను ముఖ్యమం త్రి శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసి న కార్యక్రమంలో తెలంగాణ ప్రజల కు అంకితం చేశారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభాపతి గడ్డం ప్రసాద కుమార్, ఉప ము ఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, రైతు కమిషన్ చైర్మన్, సభ్యులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్ర సంగం యావత్తు ఆయన మాట ల్లో నే…పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతా భూ భారతిని నాలుగు మం డలాల్లో చేపడుతాం. ప్రజా పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, ప్రజల సమస్యలను శాశ్వ తంగా పరిష్కరించే దిశగా ఉం డాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.
ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉంది. రెవెన్యూ అధికారులను ప్రజ లకు చేరువ చేయాలనేదే ప్రభు త్వ ఉద్దేశం. గత పాలకుల తరహాలో రెవెన్యూ సిబ్బందిని ప్రజల ముం దు దోషులుగా నిలబెట్టే ఆలోచన కు ప్రజా ప్రభుత్వం వ్యతిరే కం. అవి నీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినం గా వ్యవహరిస్తాం. కానీ వ్యవస్థపై కాదు.
ఎంతో మంది అభిప్రాయాలను పరి గణలోకి తీసుకుని, ప్రజల నుం చి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భూములకు సంబంధించి శా శ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దే శంతో భూ భారతి చట్టం తె చ్చాం.
ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు లు నిర్వహించి రైతుల నుంచి విజ్ఞ ప్తులను తీసుకుని వాటిని పరిష్క రించాలి. ప్రభుత్వలక్ష్యం నెరవేరా లంటే రెవెన్యూ సిబ్బంది మాత్రమే ఆ పనిని చేయగలరు. రెవెన్యూ సిబ్బంది రైతాంగాన్ని రెండు కళ్ల లాంటి వారు. రెవెన్యూ శాఖపైన కొందరు సృష్టించిన అపోహలను తొలగించాల్సిన బాధ్యత అంద రిపైనా ఉంది.
గ్రామాలు, మండలాల్లో ప్రజా ద ర్బార్లు, రెవెన్యూ సదస్సులు నిర్వ హించడం ద్వారా అవగాహన క ల్పించాలి. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చే యండి. ఈ చట్టాన్ని గ్రామాలకు తీసుకెళ్లండని ముఖ్యమంత్రి కోరారు.