Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMrevathreddy : తెలంగాణ యువతకు తీపికబురు, జపాన్‌లోఉద్యోగావకాశాలు

తెలంగాణ యువతకు తీపికబురు, జపాన్‌లో ఉద్యోగావకాశాలు

CMrevathreddy:   ప్రజా దీవెన, జపాన్: తెలంగాణ యువత కు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్ర భుత్వం మరో అడుగు ముం దుకేసింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ అధ్వర్యంలోని తెలంగాణ ఓవ ర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) జపాన్‌లోని రెండు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కు దుర్చుకుంది. టెర్న్ (టీజీయూకే టెక్నాలజీస్ ప్రై వేట్ లిమిటెడ్), రా జ్ గ్రూప్ తో రా ష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు చేసు కుంది. జపాన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నే తృత్వంలో అధి కారుల బృందం ఆ రెండు సంస్థల ప్రతినిధులతో చర్చ లు జరిపింది.

తెలంగాణలో నైపుణ్యమున్న నిపు ణులను జపాన్‌లోని అధిక డి మాండ్ ఉన్న రంగాలలో ఉద్యోగ అవకా శాలు కల్పించాలనే లక్ష్యం తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెర్న్ గ్రూప్ టోక్యోలో ప్రాంతీ య కార్యాలయంతో పాటు సాఫ్ట్‌వేర్, ఇంజనీ రింగ్, స్కిల్డ్ వర్కర్ రంగాలలో అంతర్జాతీయ నియామకాలు చేపడుతుంది.

రాజ్ గ్రూప్ జపాన్‌లో పేరొందిన నర్సింగ్ కేర్ సంస్థ త్సుకుయి కార్పొ రేషన్ లిమిటెడ్‌ భాగస్వామ్యంతో గతంలో టామ్ కామ్ తో కలిసి పని చేసింది. కొత్త ఒప్పందంతో హెల్త్ కేర్ రంగంలో పాటు ఇతర రంగాల్లోనే సహకారం విస్తరించనుంది. ఈ రెండు జపనీస్ సంస్థలు రాబో యే ఒకటి నుండి రెండు సంవత్స రాలలో సుమారు 500 ఉ ద్యోగ అవకాశాలను అందించనున్నాయి.

హెల్త్ కేర్, నర్సింగ్ రంగంలో 200 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ రంగం లో (ఆటోమోటివ్, మెకానికల్, కం ప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ) 100 ఉద్యోగాలు, హాస్పిటా లిటీ రంగంలో 100 ఉద్యోగాలు, మరియు నిర్మాణ రంగంలో (సివిల్ ఇంజనీరింగ్, భవన నిర్మాణం, మౌ లిక సదుపాయాల అభివృద్ధి, సా మగ్రి నిర్వహణ మరియు నిర్వహ ణ) 100 ఉద్యోగాలు అందుబాటు లోకి వస్తాయి.

యువతకు నైపుణ్యాల శిక్షణతో పాటు అంతర్జాతీయ ఉద్యోగ అవ కాశాలను మెరుగుపరచాలనే రా ష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు ఈ ఒ ప్పందాలు అద్దం పట్టాయి.